ఒకోసారి రోగి మరణానికి నేనే కారణమేమో అనిపిస్తూ ఉంటుంది…స్వయంగా వెంటిలేటర్లు తొలగిస్తాం.!

ఒకోసారి రోగి మరణానికి నేనే కారణమేమో అనిపిస్తూ ఉంటుంది…స్వయంగా వెంటిలేటర్లు తొలగిస్తాం.!

by Anudeep

Ads

చాలా మంది సమస్యలకు భయపడి ఆత్మహత్య చేస్కుంటుంటారు..నిజానికి తమ ప్రాణాన్ని తీసుకునే హక్కు ఏ మనిషికి లేదు..అది చట్టరిత్యా నేరం కూడా.. కానీ ఏదైనా అనారోగ్య రీత్యా ఇక బతకడం అసాధ్యం అనుకుంటే, చావే శరణ్యం అనుకునే పరిస్థితిల్లో న్యాయస్థానం అనుమతి ద్వారా మెర్సీకిల్లింగ్ కి వెళ్లవచ్చు.. కానీ ఇది ప్రతి కేసుకి వర్తించదు..ప్రస్తుతం ఉన్న పాండమిక్ సిట్యుయేషన్లో నర్సులపై ఎటువంటి ఒత్తిడి ఉంటుందనేది జౌనిత నిట్ల అనే నర్సు బిబిసితో స్వయంగా పంచుకున్నారు.

Video Advertisement

రోగి ట్రీట్మెంట్ కి సహకరించకపోతే, మేమే స్వయంగా వెంటిలేటర్ తీసేస్తాం అని ప్రకటించారు… కానీ ఈ ప్రకటణ వెనుక ఎంతో వేదన ఉంది..అది ఎంత సుదీర్ఘమైన ప్రక్రియ..అది వారి రోజువారి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..అనే ప్రతి విషయాన్ని పంచుకున్నారు..తన అనుభవాలు.. జౌనిత మాటల్లోనే.. “”వెంటిలేటర్లని తొలగించడం మానసికంగా చాలా బాధాకరంగా ఉంటుంది. ఒక్కొక్కసారి రోగి మరణానికి నేనే కారణమేమో అనిపిస్తూ ఉంటుందని” జౌనిత నిట్ల చెప్పారు. ఆమె లండన్ రాయల్ ఫ్రీ హాస్పిటల్‌లో ప్రధాన నర్స్ గా పని చేస్తున్నారు.

కరోనా శ్వాససంబంధమైన సమస్యలను కలిగిస్తుందని, రోగి సొంతంగా శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ పంపించి, కార్బన్ డయాక్సైడ్‌ని బయటకి తెచ్చే పనిని ఈ వెంటిలేటర్లు చేస్తాయి. అలా అని కేవలం వెంటిలేటర్లు రోగి ప్రాణాన్ని కాపాడలేవు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్తితుల్లో వెంటిలేటర్లను తొలగించాల్సిన కఠిన నిర్ణయాలు ఉన్నాయి. ఈ వెంటిలేటర్లు తొలగించడం అనేది వారి డ్యూటిలో ఒక భాగంగా చెప్పారు జౌనిత.

వెంటిలేటర్ తొలగించే ముందు, తర్వాత ఏం చేస్తారంటే..

గత నెలలో  నిట్ల పొద్దునే డ్యూటీకి వెళ్ళేటప్పటికి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఒక కోవిడ్-19 రోగికి వెంటిలేటర్ తొలగించమని ఆదేశాలు అందాయి.ఆ రోగి కూడా కమ్యూనిటీ వైద్యంలో నర్సుగా పని చేసేవారు. వెంటనే నిట్ల ఆ రోగి కూతురితో మాట్లాడారు. “ఆమె ఆఖరి కోరికలు కానీ, మతపరంగా పాటించాల్సిన అంశాలు ఏమన్నా ఉన్నాయేమోనని అడిగి తెలుసుకున్నారు.

ఐసీయూలో  ఆ రోగితో పాటు, మరో ఎనిమిది మంది ఉన్నారు..వారెవరూ స్పృహలో లేరు.. రోగి చుట్టు ఉన్న అన్ని కర్టెన్లు వేసేసి, అలారం ఆపేసాను. నేను ఆ పని చేసేటప్పుడు “వైద్య బృందం అంతా ఒక్క క్షణం మౌనంగా ఉంటారు. మా రోగుల సౌకర్యం కూడా మాకు ముఖ్యమే” అని నిట్ల చెప్పారు.తర్వాత “నేను నెమ్మదిగా ఫోన్ రిసీవర్‌ను రోగి చెవి దగ్గర పెట్టి వాళ్ళ అమ్మాయిని మాట్లాడమన్నాను”. నిజానికి వాళ్లు వీడియో కాల్ చేయమని అడిగారు, కానీ ఐసియు మొబైల్స్ అనుమతించరు. రోగి కుటుంబం కంప్యూటర్లో ఒక మ్యూజిక్ ని ప్లే చేయమని అడిగారు.. తన ప్రాణం వదిలే వరకు నేను ఆమె చేతిని పట్టుకుని పక్కనే నిల్చున్నాను… “వెంటిలేటర్ తొలగించిన ఐదు నిమిషాల్లోనే ఆ రోగి మరణించారు”. రోగి వాళ్లమ్మాయి తనతో మాట్లాడుతూనే ఉంది “నాకు అదొక ఫోన్ కాల్ మాత్రమే , కానీ అది ఆ రోగి కుటుంబానికి చాలా ముఖ్యమైన క్షణం.

“నేను ఐసీయూలో మానిటర్ మీద ఫ్లాష్ లైట్లని చూసాను. గుండె కొట్టుకునే వేగం సున్నాకి పడిపోయింది. స్క్రీన్ మీద ఫ్లాట్ లైన్ కనిపించింది”. రోగికి ఉన్న మత్తుమందు ట్యూబ్ లను తొలగించి, ఒక కొలీగ్ సాయంతో ఆమెకి మంచం మీదే స్నానం చేయించి తెల్లని వస్త్రంలో చుట్టాం. ఆమె నుదుటి మీద సిలువ గుర్తు పెట్టి ఆమె శరీరాన్ని బ్యాగ్‌లో పెట్టాం” అప్పటికి తన కూతురు ఫోన్లో మాట్లాడుతూనే ఉంది..అప్పుడు రిసీవర్ తీసుకుని తన తల్లి మరణించిందని చెప్పాను.

కరోనా రోజుల్లో ఇలాంటి పరిస్థితి వస్తే కనీసం రోగులను చూడడానికి కుటుంబ సభ్యులను అనుమతించేవాళ్లం, కానీ ఇప్పుడు ఆ సదుపాయం కూడా లేదు అని భారమైన హృదయంతో నిట్ల చెప్పారు. నా కళ్లముందే కొందరు శ్వాస ఆడక ఇబ్బంది పడుతూ, చివరిశ్వాస విడుస్తారు.. అలాంటివి రాత్రిపూట భయం కలిగిస్తుంటాయి..కాని అది కూడా నా డ్యూటిలో భాగం అని ధైర్యం చెప్పుకోవడానికి  ప్రయత్నిస్తాను..ప్రస్తుతం ఉన్న పాండమిక్ సిట్యుయేషన్లో మాకు మేమే ధైర్యం చెప్పుకుంటున్నాం..కానీ మాట్లాడుకునేప్పుడు మాటల్లో వచ్చే వణుకుని బట్టి అందరూ భయంతోనే గడుపుతున్నారనేది అర్దం అవుతుంది అని తమ పరిస్థితిని వివరించారు జౌనిత నిట్ల.

source: bbc


End of Article

You may also like