Ads
సోషల్ మీడియా వచ్చిన తరువాత చిన్న చిన్న విషయాలు కూడా వైరల్ అయిపోతున్నాయి.. ఇటీవల ఓ పెళ్లి కూతురు “నీ బులెట్ బండి ఎక్కి వచ్చేత్తా పా..” అన్న పాటకు డాన్స్ చేసి ఇరగదీసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో రెండు మూడు రోజుల పాటు నెట్టింట్లో వైరల్ అయింది.
Video Advertisement
అసలు ఆమె ఈ పాటకు డాన్స్ చేసిన తరువాతే ఈ పాట మరింత వైరల్ అయింది. ఈ పాటకి డాన్స్ చేయడం తోనే ఆమె బాగా పాపులర్ అయిపొయింది. అయితే.. ఇదే రూట్ లో ఫేమస్ అయిపోదాం అనుకుందో ఏమో జ్యోతి అనే ఓ నర్స్ కూడా ఇలానే డాన్స్ చేసింది. అది కూడా ఆసుపత్రిలో ఉన్న సమయం లో.. విధులు నిర్వర్తిస్తున్న టైం లో ఆమె ఈ పాటకి డాన్స్ చేసింది.
ఆమె డాన్స్ వీడియో కూడా బాగా పాపులర్ అయింది. అయితే.. ఆమె ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. జిల్లా కలెక్టర్ ఆమె డాన్స్ చేయడం పై అసహనం వ్యక్తం చేసారు. విధులు నిర్వర్తించాల్సిన టైం లో… అది కూడా ఇండిపెండెన్స్ డే రోజున ఇలా చేయడం ఏంటి అంటూ ఆమె పై ఫైర్ అయ్యారు. అంతేకాదు ఆమెకు మెమో కూడా జారీ చేసారు. ఈ వార్త బయటకు రావడం తో.. నెటిజన్లు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఆమె చేసినదాన్లో తప్పు ఏముందంటూ ప్రశ్నిస్తున్నారు. జ్యోతి కూడా స్వతంత్ర దినోత్సవం సందర్భం గా కేవలం సంతోషం పట్టలేకే ఇలా డాన్స్ చేసానని వివరణ ఇచ్చింది.
Watch Video:
End of Article