40 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోయిన్ లాగా కనిపిస్తున్న ఈ ఒకప్పటి హీరోయిన్ ని గుర్తుపట్టారా.?

40 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోయిన్ లాగా కనిపిస్తున్న ఈ ఒకప్పటి హీరోయిన్ ని గుర్తుపట్టారా.?

by Anudeep

Ads

సినిమా ఇండస్ట్రీ కి తలుపులెప్పుడు తెరిచే ఉంటాయి. చాల మంది వచ్చి సెటిల్ అయిపోతారు. కొందరు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయి తెరమరుగైపోతుంటారు. వారి జీవితాల్లో పరిస్థితులను బట్టి తిరిగి తెరపై కనిపించడానికి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. ఈ నటి కూడా ఆ కోవకే చెందుతారు. ఆమె ఎవరో కాదు.. శృతిరాజ్.

Video Advertisement

sruthi raj 3

ఒకప్పుడు ఆమె శ్రీకాంత్ హీరో గా వచ్చిన “ఓ చినదాన” సినిమాలో నటించి మెప్పించారు. అప్పట్లో ఆమె ఆకట్టుకున్నా ఆమెకు తెలుగు నాట పెద్దగా అవకాశాలు రాలేదు. మరో వైపు ఆమె మలయాళం వైపు ఆసక్తి కనబరచడం తో ఆమెకు అటువైపు ఎక్కువ అవకాశాలు వచ్చాయి. తమిళ, మలయాళం లలో మొత్తం ఇరవై కి పైగా సినిమాలలో ఆమె నటించారు.

ఆ తరువాత కొంతకాలం పాటు ఆమె ఇండస్ట్రీ కి దూరం గా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం సినిమాలపై ఆసక్తి తో ఆమె తెలుగు ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఏ పాత్రను అయినా సరే చేద్దాం అనుకుంటుండగా.. ఆమె కు బుల్లితెరపై నటించే అవకాశం లభించింది.ఆమె ‘శ్రావణి సుబ్రహ్మణ్యం’ అనే సీరియల్ లో కనిపించారు.

అభిమానులు ఏమాత్రం తరగని ఆమె అందాన్ని చూసి చకితులవుతున్నారు. సాధారణం గా ఎవరైనా కొన్ని సంవత్సరాలు గడిచాక శరీరం లో మార్పులు కనిపిస్తాయి. లావు గా కనిపిస్తూ ఉంటారు. కానీ, శృతిరాజ్ మాత్రం నలభై ఏళ్ల వయసొచ్చినా యంగ్ లుక్ లో హీరోయిన్ లా కనిపిస్తున్నారు. ఇటీవల, ఆమె నెట్టింట్లో పంచుకున్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆమె అందం ఇసుమంతైనా తగ్గలేదంటూ నెటిజన్లు కామెంట్ లు చేస్తున్నారు.


End of Article

You may also like