Ads
ఈ కరోనా మహమ్మారి కారణం గా ఎన్నో ఘోరాలు చూడాల్సి వస్తోంది. కరోనా కారణం గా ఎవరైనా చనిపోతే కూడా వెళ్లే పరిస్థితి ప్రస్తుతం లేదు. ఈ క్రమం లో పెనుకొండలో ముగ్గురు వృద్ధులు ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికం గా విషాదం నెలకొంది. పెనుకొండ లో వీరు ఉంటున్న నివాసం నుంచి దుర్వాసన వస్తూ ఉండడం తో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
Video Advertisement
వారు వచ్చిన వెంటనే తలుపులు పగలగొట్టి చూడగా మూడు వృద్ధ మృతదేహాలు కనిపించాయి. మడకశిర వద్ద ఓ బ్యాంకు లో పని చేసి రిటైర్ అయినా అశ్వర్థప్ప తన ఇద్దరు చెల్లెళ్ళతో కలిసి పెనుకొండ లో ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే.. కరోనా పరిస్థితుల్లో.. వయసు మీద పడ్డ వారిని పట్టించుకునే వారు సాయం అందించేవారు ఎవరూ లేకపోవడం తో.. వారు ఈ పని చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయమై మరింత లోతు గా దర్యాప్తు చేస్తామన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కోసం వారి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
End of Article