Ads
ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు అని ఇప్పటికే చాలా సంఘటనలు రుజువు చేసాయి. ఇద్దరి మనసుల కలయికకు వివాహ బంధం శాశ్వత గుర్తును ఇస్తుంది. ప్రేమకు మారు పేరు అయిన ఎందరినో చరిత్ర మనుకు చూపిస్తోంది. ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని ఇద్దరి మనసుల మధ్య ఉన్న బంధం సరిపోతుందని మరోసారి నిరూపిస్తూ మహారాష్ట్ర లో ఓ వృద్ధ జంట ప్రేమ వివాహం చేసుకున్నారు. నెట్టింట్లో వైరల్ గా మారిన ఈ అవ్వాతాతల వయసు ఏడుపదులకు పైమాటే.. వీరి పెళ్ళికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Video Advertisement
మహారాష్ట్ర రాష్ట్రం కొల్హాపుర్ లో ఉన్న ఓ వృద్దాశ్రమం లో బాబూరావు పాటిల్ అనే 75ఏళ్ళ వృద్దుడు ఉన్నాడు. అదే వృద్దాశ్రమంలో అనుసయ షిండే అనే 70ఏళ్ళ వృద్దురాలు ఉంది. వీరిద్దరికి గతం పెళ్లిళ్లు అయ్యాయి. వారి భాగస్వాములు మరణించారు. అయితే వృద్ధాశ్రమం లో కలిసిన వీరిద్దరూ వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఒకరితో మరొకరు జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వృద్దాశ్రమ నిర్వాహకులకు చెప్పడం తో వారిద్దరికీ పెళ్లి చేయాలనీ నిర్ణయించుకున్నారు నిర్వాహకులు.
ముదిమి వయసులో వయసులో పెద్దలకు ఒకరితోడు మరొకరికి అవసరమేనని, పెళ్ళి ద్వారా అది సాధ్యమవుతుందని అనిపించింది. దాంతో వారిద్దరికీ ఆచార సంప్రదాయాల ప్రకారం పెళ్ళి జరిపించాలనుకున్నారు. ఆశ్రమానికి దగ్గర్లో ఉన్న కొల్హాపూర్ టెంపుల్ లో వరుడు బాబూరావు పాటిల్, వధువు అనుసయ షిండే మెడలో పూలహారం వేసి ఆమెను భార్యగా స్వీకరించాడు. వధువు కూడా వరుడి మెడలోపూలహారం వేసి అతడిని భర్తగా స్వీకరించింది. ఇలా వీరిద్దరూ దైవ సమక్షంలో ఒక్కటయ్యారు.
వీరి వివాహానికి సంబంధించిన వీడియోను, పెళ్ళి ఫోటోలను వివేక్ గుప్తా అనే ట్విట్టర్ యూజర్ ట్విట్టర్ లో షేర్ చేశాడు. దీనికి నెటిజన్ల నుండి చాలా స్పందన వస్తోంది. ఆ వయసులోవారికి ఒకరి తోడు మరొకరి అవసరం అని కొందరు కామెంట్ చేశారు. మరొకరు అయితే ప్రేమ మనసుకు సంబంధించినది దానికి వయసుతో సంబంధం లేదు అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పెళ్ళికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి.
End of Article