Home Filmy Adda “సీతాకోకచిలుక” సినిమా హీరోయిన్… “ముచ్చర్ల అరుణ” గుర్తున్నారా..? ఇప్పుడు ఇలా అయిపోయారేంటి..?

“సీతాకోకచిలుక” సినిమా హీరోయిన్… “ముచ్చర్ల అరుణ” గుర్తున్నారా..? ఇప్పుడు ఇలా అయిపోయారేంటి..?

by Anudeep

అందం, అభినయం కలబోసిన అచ్చ తెలుగు అమ్మాయి ముచ్చర్ల అరుణ. తొలి సినిమాతోనే ప్రముఖ దర్శకుడు భారతీరాజా సినిమాలో చాన్స్‌ కొట్టేసింది. 1981 లో ఆయన తెరకెక్కించిన సీతాకోకచిలుక అప్పట్లో ఓ సంచలనం. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచాయి. ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవడంతో ఓవర్‌నైట్‌ స్టార్డడమ్‌ సంపాదించుకుంది అరుణ.

తెలుగులో చంటబ్బాయి, స్వర్ణకమలం, సంసారం ఒక చదరంగం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది ముచ్చర్ల అరుణ. కేవలం 10 సంవత్సరాల్లో 70 కి పైగా చిత్రాల్లో నటించారామె. అందులో కొన్ని సినిమాల్లో ముచ్చెర్ల అరుణ హీరోయిన్ గా కాకపోయినా ఒక ముఖ్య పాత్రలో నటించిన కూడా ఆ సినిమాలు చాలా మంచి పేరు తీసుకొచ్చాయి.

vetaran actress muccharla aruna latest pics..
ఇక హీరోయిన్ గా దూసుకుపోతున్న సమయంలోనే ఈమె బిజినెస్ మాన్ మోహన్ గుప్త ని పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఈ దంపతులకు నలుగురు సంతానం.ప్రస్తుతం ముచ్చర్ల అరుణ అమెరికాలో సెటిల్ అయ్యింది. అంతకుముందు కొన్ని ఇంటర్వ్యూలలో, టాక్ షోలలో ముచ్చర్ల అరుణ కనిపించినా కూడా మళ్ళీ తర్వాత కొన్ని రోజులు ఎక్కడా కనిపించలేదు.

vetaran actress muccharla aruna latest pics..

అయితే ఇటీవలే తన ఇంస్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించారు అరుణ. అందులో వంటలు, హెల్తీ లైఫ్‌, వర్కవుట్స్‌ వంటి ఎన్నో ఇంట్రెస్టింగ్‌ విశేషాలను పంచుకుంటుంది. అలనాటి అందాల తార మళ్లీ ఇన్నాళ్లకు టచ్‌లోకి రావడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్‌గానే ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చిన అరుణకు ప్రస్తుతం ఒక లక్షా 69 వేలకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు.

vetaran actress muccharla aruna latest pics..
ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో భాగంగా అరుణ మాట్లాడుతూ తన కలర్ కు సంబంధించి వచ్చిన విమర్శలపై స్పందించింది. భగవంతుడు ఇచ్చిన రంగు చేతుల్లో ఏముంది అని చెప్పుకొచ్చింది ముచ్చర్ల అరుణ. అయితే చాలా మంది పాత సినిమా హీరోయిన్లు ఇప్పుడు ఏదో ఒక మంచి రోల్ తో మళ్లీ సినిమాల్లో అడుగు పెడుతున్నారు. ఇప్పుడు ముచ్చర్ల అరుణ కూడా అలాగే మళ్లీ సినిమాల్లో రావాలి అని చాలా మంది అనుకుంటున్నారు.

You may also like