Home News పాత ఇల్లు కూల్చేస్తుంటే.. వందల ఏళ్ల నాటి లాకర్ లభ్యమైంది.. అందులో ఏముందంటే..?

పాత ఇల్లు కూల్చేస్తుంటే.. వందల ఏళ్ల నాటి లాకర్ లభ్యమైంది.. అందులో ఏముందంటే..?

by Anudeep

పల్లె ప్రగతి లో భాగం గా మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ గ్రామం లో నిన్న వందేళ్ల కాలం నాటి పురాతన మైన ఇంటిని కూల్చేశారు. ఆ సమయం లోనే ఒక పురాతనమైన లాకర్ లభ్యమవడం తో స్థానికం గా కలకలం రేగింది. గ్రామం లో చుట్టూ పక్కన ప్రజలంతా గుమి గుడారు. ఆ లాకర్ లో ఏమి ఉంటుందన్న విషయమై ఉత్కంఠ నెలకొంది. బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు ఆ లాకర్ లో ఉండి ఉండొచ్చని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.

old locker

దీనితో.. పోలీసులు పటిష్ట భద్రతల నడుమ లాకర్ ను భద్రపరిచారు. భద్రతా సిబ్బంది నడుమ, పంచాయితీ సెక్రటరీ, మండల రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ల సమక్షం లో ఈ లాకర్ ను వెల్డింగ్ కట్టర్ ను ఉపయోగించి దాదాపు నాలుగైదు గంటల పాటు శ్రమించి ఓపెన్ చేసారు. తీరా చూస్తే.. పురాతన కాలం నాటి దస్తావేజులు కనిపించాయి. వెండి, బంగారం ఉండి ఉండవచ్చని గ్రామస్తులు భావించారు కానీ అందులో వ్యాపారాలకు సంబంధించిన దస్తావేజులు దర్శన మిచ్చాయి. పూర్వకాలం లో వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన ముఖ్యమైన కాగితాలను ఇలా లాకర్లలోనే దాచుకునేవారని కొందరు గ్రామస్తులు చెబుతున్నారు.

You may also like