Ads
సినిమా అంటే అందరికీ వినోదం. ఒక మూడు గంటలు పాటు జీవితంలోని అన్ని టెన్షన్లు మర్చిపోయి ప్రశాంతంగా కుటుంబంతో కలిసి లేదా ఫ్రెండ్స్ తో కలిసి ఆనందంగా ఉండేందుకు ఎక్కువ శాతం మంది సినిమాకి వెళ్తూ ఉంటారు.
Video Advertisement
భారతీయ సినిమాకి గొప్ప చరిత్ర ఉంది. ఎన్నో భాషలు ఎంతోమంది నటీనటులు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ప్రేక్షకులను అలరించారు. సినిమా వారందరికీ థియేటర్ అనేది గుడితో సమానం. ఎంత కష్టపడి సినిమా తీసిన అది ప్రేక్షకుల వద్దకు చేరాలంటే కచ్చితంగా ధియేటర్ ఉండాలి. ఇండియాలో చాలా ఎక్కువ థియేటర్లో ఉన్నాయి. ఇప్పుడు అంత శాటిలైట్, 4కే లేజర్, ఎల్ఈడి స్క్రీన్లు లాంటి అధునాతన టెక్నాలజీ వచ్చేసింది. అయితే గతంలో సినిమాలు ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించేవారు.
ఇప్పుడు మల్టీప్లెక్స్ లో సింగల్ స్క్రీన్ లో ఉంటూ డిఫరెంట్ థియేటర్లు కూడా వచ్చాయి. ప్రస్తుతం మల్టీప్లెక్స్ లో టిక్కెట్ ధర 300 నుంచి 700 వరకు ఉంటుంది. దానికి తగ్గ సౌకర్యాలు అందులో ఉంటాయి. అలాగే సింగిల్ స్క్రీన్ల టికెట్ ధర 100 నుంచి 300 వరకు ఉంటుంది.అయితే 1975 లో సినిమా టికెట్ ధర ఎంత ఉండేదో తెలుసా…?
ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఓ పాత సినిమా టికెట్ ఒకటి వైరల్ అవుతుంది.ఇది 1975 వ సంవత్సరం నాటిది. గెలాక్సీ సినిమా అనే థియేటర్ లో దీవార్ అనే సినిమా ఆ టైంలో ఆడుతుంది.అప్పటి బాల్కనీ టికెట్ ధర 3 రూపాయలు ఆ ఆ టికెట్ మీద ముద్రించి ఉంది.ఇది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.అప్పటికి ఇప్పటికి ఎంత తేడా అని ఆశ్చర్యపోతున్నారు
End of Article