Ads
టీవీలో ఛానల్స్ ఎన్నైనా రావచ్చు. ఎన్నో కొత్త రకమైన కాన్సెప్ట్ లతో షోస్ కూడా రావచ్చు. ఎన్నో కొత్త సీరియల్స్ కూడా రావచ్చు. కానీ అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ మారనిది మాత్రం ఒకే ఒక్కటి. అవే న్యూస్. అంతకుముందు మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లోనే ఒక పర్టిక్యులర్ సమయానికి వార్తలు వచ్చేవి. ఆ రోజు మొత్తంలో అప్పటివరకు జరిగిన విషయాలన్నిటినీ ఒక అరగంటలో చెప్పేవారు న్యూస్ రీడర్స్.
Video Advertisement
కానీ ఇప్పుడు న్యూస్ కోసమే ప్రత్యేకంగా ఛానల్స్ మొదలయ్యాయి. ఏ సమయానికి ఎక్కడ ఎలాంటి విషయం జరుగుతోంది అనేది వెంటవెంటనే అప్డేట్ చేస్తారు. అయినా సరే ఈ టీవీ లాంటి ఛానల్స్ లో ఇప్పటికి కూడా ఉదయం 7 గంటలకి, రాత్రి 9 గంటలకి వార్తలు ప్రసారం అవుతాయి. ఆ సమయానికి వార్తలు లేకుండా ఈ టీవీ ఛానల్ ని ఊహించుకోవడం కూడా కష్టమే. న్యూస్ తో పాటు న్యూస్ రీడర్స్ చదివే విధానం కూడా చాలా ముఖ్యం.
ఉచ్చారణలో తప్పులు పోకుండా, వార్త ఎలాంటిదైనా సరే ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తూ బాలన్స్డ్ గా చదవాలి. దాదాపు ప్రతి న్యూస్ రీడర్ ఇలాగే చదువుతారు. అయితే అంతకుముందు వచ్చే న్యూస్ రీడర్స్ లో కొంతమంది ఇప్పటికి కూడా ప్రేక్షకుల మైండ్ లో నిలిచిపోయారు. అలా అంతకు ముందు ఉన్న న్యూస్ రీడర్స్ కొంతమంది ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 కీర్తి రెడ్డి
కీర్తి రెడ్డి న్యూస్ చదవడంతో పాటు ఎన్నో ప్రోగ్రామ్స్ కి యాంకరింగ్ కూడా చేసే వారు.
#2 లిఖిత కామిని
లిఖిత కామిని న్యూస్ రీడర్ గా చేయడంతో పాటు సినిమాల్లో, సీరియల్స్ లో కూడా నటించారు. అందులోనూ ముఖ్యంగా గౌతమ్ ఎస్ఎస్సి సినిమాలో నవదీప్ చెల్లెలి పాత్ర, అలాగే చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్ లో పాత్రల ద్వారా ప్రేక్షకులకు ఇంకా చేరువయ్యారు.
#3 ప్రగతి
ప్రగతి ఈటీవీ లో వార్తలు చదివే వారు. ఇప్పటికి కూడా చాలామంది తెలుగు ప్రేక్షకులకు ప్రగతి గుర్తుండే ఉంటారు.
#4 అనిత ఆప్టే
అనిత ఆప్టే కూడా న్యూస్ చదవడంతో పాటు ప్రోగ్రామ్స్ కి, లైవ్ షోస్ కి యాంకరింగ్ చేసే వారు. అలాగే ఎన్నో వీడియోలు కి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం కొన్ని షోస్ కి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
#5 మైథిలి
మైథిలి జెమినీ టీవీలో న్యూస్ చదివేవారు. జెమిని ఛానల్ లో వచ్చే న్యూస్ ఫాలో అయ్యే వారికి తప్పకుండా మైథిలి గుర్తుండే ఉంటారు.
వీరే కాకుండా అనసూయ, ఇంకా ఎంతో మంది న్యూస్ రీడర్స్ గా కూడా వ్యవహరించారు.
End of Article