మనం ఒక్కోసారి ఎక్కువ మొత్తం లో నగదు ని డ్రా చేస్తూ ఉంటాం.. అవసరం కొద్దీ నగదుని డ్రా చేసినా.. వాటిని భద్రపర్చుకునే వరకు నిద్రపోకూడదు.. ఏమాత్రం అప్రమత్తం గా ఉన్నా రోడ్డు పై మనలని కంట పెట్టుకుని ఉండేవారు వాటిని కొట్టేయడానికి ఏ మాత్రం సంకోచించరు. తాజాగా.. ఓ వ్యక్తి లక్షన్నర రూపాయల నగదు ని డ్రా చేసి బిర్యానికోసం ఆగాడు. తిని వచ్చేసరికి నగదు చోరీకి గురి అయిన సంఘటన చెన్నై లోని ఈస్ట్ కోస్ట్ రోడ్‌… ఇచ్చంబాక్కంలో చోటు చేసుకుంది.

man loots money

వివరాల్లోకి వెళ్తే ఈస్ట్ కోస్ట్ రోడ్‌… ఇచ్చంబాక్కం కు చెందిన 32 సంవత్సరాల కృష్ణ స్వామి అనే వ్యక్తి పాల ప్యాకెట్లు, న్యూస్ పేపర్లు సప్లై చేసే పని చేస్తూ ఉంటాడు. ఇటీవల అన్నసలాయ్ వద్ద ఓ ప్రైవేట్ బ్యాంకు లో లక్షన్నర రూపాయల నగదు ని డ్రా చేసాడు. ఆ నగదు ని స్కూటీ సీటు కింద దాచాడు. ఈస్ట్ కోస్ట్ రోడ్డు లో ప్రయాణిస్తూ ఓ హోటల్ లో బిర్యానీ తినడం కోసం ఆగాడు. డబ్బు సీటు కింద ఉంది కాబట్టి ఎవరికీ అనుమానం రాదనీ భావించాడు.

man loots money 2

లోపలకి వెళ్లి తిరిగి బయటకు వచ్చేసరికి స్కూటీ సీట్ కొంచం పైకి లేచినట్లు కనిపించేసరికి అనుమానం వచ్చింది. తీరా చూస్తే అందులో డబ్బు లేకపోవడం తో లబోదిబోమన్నారు. తాను స్కూటీ కి లాక్ చేసే వెళ్లానని.. ఇంతలో ఎవరు తీశారో తెలియదంటూ హతాశుడయ్యాడు. వెంటనే తేరుకుని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు సిసి టీవీ ఫుటేజీని చెక్ చేసి అనుమానాస్పదం గా కనిపించిన వ్యక్తిని గుర్తించారు.

man loots money 3

అతనెవరో కాదు 42 సంవత్సరాల చిట్టిబాబు. అతను పేరు మోసిన దొంగ. బ్యాంకుల వద్ద కొంగ జపం చేస్తూ డబ్బును డ్రా చేసిన వారిని గుర్తిస్తాడు. వారి వెనకే మాటు వేసి దొంగతనానికి పాల్పడతాడు. కృష్ణస్వామి లోపలకి వెళ్ళగానే.. చిట్టిబాబు స్కూటీ లో పెట్టిన డబ్బుని దోచుకున్నాడు. అయితే పోలీసులు అతన్ని పట్టుకుని నగదు ని సీజ్ చేసారు. కోర్ట్ ప్రొసీడింగ్స్ ఇంకా పూర్తి కాలేదని చెప్పి ఇప్పటివరకు ఆ నగదుని కృష్ణ స్వామి కి ఇవ్వలేదట.