ఆస్తిని రాయించుకుని బయటకి గెంటేసిన కొడుకులకి ఈ తల్లి ఎలాంటి గుణపాఠం చెప్పిందో తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు..!

ఆస్తిని రాయించుకుని బయటకి గెంటేసిన కొడుకులకి ఈ తల్లి ఎలాంటి గుణపాఠం చెప్పిందో తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు..!

by Anudeep

తల్లితండ్రులు ఉన్న వారు అదృష్టవంతులు. అయితే.. వయసు పెరుగుతున్న కొద్దీ చాలా మంది వారిని భారంగా భావిస్తుండడం దురదృష్టకరం. కొంతమంది పిల్లలు వారిని వేరుగా ఉంచి చూసుకుంటూ ఉంటారు. కొందరైతే దారుణంగా వారిని పట్టించుకోవడమే మానేస్తూ ఉంటారు.

Video Advertisement

రాను రాను, వారి నుంచి వారసత్వంగా వచ్చే ఆస్తిని రాయించుకుని తలితండ్రులను చూడకుండా ముఖం చాటేస్తున్న వారు ఎక్కువ అవుతున్నారు. ఈ తల్లి కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది.

old women

అయితే.. ఆమె దిగులుగా కూర్చోలేదు. తన కొడుకులకు తగిన పాఠం నేర్పింది. ముల్లుని ముల్లుతోనే తీయాలన్న జ్ఞానాన్ని తన నిజ జీవితం లోను అమలు పరిచింది. ఆస్తి రాయించుకుని కొడుకులు ఆమెను పట్టించుకోకుండా ముఖం చాటేస్తే.. ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించి.. తనకి న్యాయం జరిగేవరకు పోరాడింది. 76 ఏళ్ల వయసులోనూ ఆమె న్యాయం కోసం తన పోరాటాన్ని కొనసాగించింది.

old women 1

కర్ణాటకలోని హవేరీ జిల్లాకు చెందిన ప్రేమవ్వకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తల్లికి మాయమాటలు చెప్పి… వారసత్వంగా వచ్చే ఆస్తిని ఆ నలుగురు సరిసమానంగా పంచేసుకున్నారు. ఆ తరువాత ఆమెను ఇంట్లోంచి బయటకు గెంటేశారు. దీనితో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తన కడుపున పుట్టిన పిల్లలే మోసం చేసి ఆస్తిని రాయించుకున్నారని, తనని బయటకి గెంటేశారని.. న్యాయం చేయాలని కోర్టుని కోరింది.old women 2

ఇందుకోసం ఆమె గత మూడేళ్ళుగా తన పోరాటాన్ని కొనసాగిస్తూ వచ్చింది. చివరకు కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆమె గతంలో చేసిన ఆస్తి పంపకాన్ని కోర్ట్ రద్దు చేసింది. ఈ మేరకు రెవెన్యూ విభాగం అసిస్టెంట్ కమిషనర్ తీర్పు ఇచ్చారు. భూమి, ఇంటికి సంబంధించిన యాజమాన్య డాకుమెంట్స్ లో ప్రేమవ్వ పేరుని కూడా చేర్చారు.


You may also like