Ads
కెరియర్ బాగా సాగుతున్నప్పుడు ఒక పాయింట్ లో బ్రేక్ తీసుకోవడం తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయడం చాలా చోట్ల జరుగుతూనే ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో కూడా ఇలానే చాలా మంది హీరోయిన్లు మధ్యలో బ్రేక్ తీసుకొని తర్వాత మళ్లీ ముఖ్య పాత్రల్లో మన ముందుకు వచ్చారు. వాళ్ళలో కొంత మంది ఎవరో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 నదియా
మిర్చి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన నదియా తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు.
#2 జయసుధ
జయసుధ గారు సుమంత్ హీరోగా వచ్చిన యువకుడు సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి తరువాత ఎన్నో సినిమాల్లో తల్లి పాత్రల్లో కనిపించారు.
#3 రాధిక శరత్ కుమార్
వినీత్, సౌందర్య హీరో హీరోయిన్లుగా వచ్చిన ఆరో ప్రాణం సినిమాలో సౌందర్యకి తల్లిగా నటించారు రాధిక. తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో కనిపించడంతో పాటు సీరియల్స్ లో కూడా నటిస్తున్నారు.
source : Ragalahari.com
#4 రాశి
కళ్యాణ వైభోగమే సినిమాలో మాళవిక నాయర్ కి తల్లిగా నటించారు రాశి.
#5 సుహాసిని
నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఆర్తి అగర్వాల్ కి మేనత్త గా నటించారు సుహాసిని. తర్వాత అభిమన్యు, పెదబాబు, రాఖీ, శ్రీ మహాలక్ష్మి, లీడర్, వరుడు, యాత్ర, సూర్యకాంతం, ఎంత మంచివాడవురా ఇలా ఎన్నో సినిమాల్లో కనిపించారు.
#6 రమ్యకృష్ణ
బాహుబలి లో శివగామి పాత్రలో రమ్యకృష్ణ ని తప్ప ఇంకెవరినైనా ఊహించుకోవడం చాలా కష్టం.
#7 సీత
గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ కి తల్లిగా నటించిన సీత, ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రల్లో కనిపించారు.
#8 మధుబాల
సూర్య వర్సెస్ సూర్య సినిమాలో నిఖిల్ కి తల్లిగా నటించారు మధుబాల. తర్వాత నాన్నకు ప్రేమతో సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కి తల్లిగా నటించారు.
#9 దేవయాని
నాని సినిమాలో హీరోకి తల్లిగా నటించిన దేవయాని, తర్వాత శివరాం అనే ఒక తెలుగు సినిమా చేశారు. 2016 లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలో ఉన్ని ముకుందన్ కి తల్లిగా నటించారు దేవయాని.
#10 తులసి
డార్లింగ్ సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించిన తులసి, తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, నేను లోకల్, ఇద్దరమ్మాయిలతో, శ్రీమంతుడు ఇలా ఎన్నో సినిమాల్లో కనిపించారు.
#11 రాజ్యలక్ష్మి
శంకరాభరణం రాజ్యలక్ష్మి గా సుపరిచితులైన రాజ్యలక్ష్మి గారు మల్లీశ్వరి సినిమాలో నరేష్ భార్యగా, వెంకటేష్ కి వదినగా కనిపించారు. తర్వాత అతనొక్కడే సినిమాలో కళ్యాణ్ రామ్ కి తల్లిగా నటించారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు.
#12 సిమ్రాన్
ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్, 2019 లో విడుదలైన పేట సినిమాలో మేఘా ఆకాష్ కి తల్లిగా నటించారు.
#13 సితార
ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా, అలాగే సాంబ సినిమాలో ఎన్టీఆర్ కి అక్కగా నటించిన సితార, జోష్ సినిమాలో నాగచైతన్యకి తల్లి పాత్రతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.
#14 గీత
వారసుడు సినిమాలో హీరోకి తల్లిగా నటించారు గీత. తర్వాత జానీ, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, కింగ్, కథానాయకుడు, ఇటీవల విడుదలైన వెంకీ మామ సినిమాలో కూడా నటించారు.
#15 శ్రీదేవి
శ్రీదేవి గారు ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. తర్వాత మామ్ సినిమాలో నటించారు.
#16 శరణ్య
రాఖీ సినిమాలో ఛార్మికి తల్లిగా నటించిన శరణ్య, తర్వాత ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రల్లో కనిపించారు. రఘువరన్ బీటెక్ సినిమాతో అందరికీ ఇంకా చేరువయ్యారు.
#17. రోహిణి (అలా మొదలైంది)
#18. రోజా (గోలీమార్)
#19. ఆమని (ఆ నలుగురు)
#20. సంగీత (సరిలేరు నీకెవ్వరు)
#21. ఐశ్వర్య (అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, ఆకాశమంత)
#22. ఇంద్రజ (శతమానం భవతి)
End of Article