Ads
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, కష్టపడితే కన్న కలలను నిజం చేసుకోవచ్చు, నిరంతరమైన కృషి, ప్రయత్నం మన తలరాతని మారుస్తుంది వంటి మాటలు వినేటప్పుడు ఇవన్నీ సినిమాలలోనే అని తీసిపారేస్తూ ఉంటారు చాలామంది. అయితే ప్రయత్నం,అంకితభావం, అవసరం, కష్టపడే తత్వం ఇవన్నీ ఒక మనిషికి తోడైతే అతను అచిర కాలంలోనే ఉన్నత స్థానానికి చేరుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
Video Advertisement
అలాంటి కోవకి చెందిన వ్యక్తి జెన్సన్ హువాంగ్. రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేసిన ఈ వ్యక్తి ఇప్పుడు ప్రపంచ ధనవంతుల జాబితాలో 23వ స్థానంలో ఉన్నారంటే ఆయన జర్నీ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. 1963 లో తైవాన్ లోని తైనాన్ లో జెన్సన్ హువాంగ్ జన్మించారు. ఈయన కుటుంబం ఆయనకి ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే థాయిలాండ్ కి మకాం మార్చారు.
9 ఏళ్ళ వయసులో అతని మేనమామతో కలిసి వాషింగ్టన్ లోని టాకోమాకు వెళ్ళాడు. చదువుకునే రోజుల్లో అతను రెస్టారెంట్ లో సర్వర్ గా పని చేసేవారు. తరువాత క్రిస్ మలాచోస్కీ అండ్ కర్టిస్ ప్రీమ్ లతో కలిసి 1993లో ఎన్ విడియా స్థాపించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన హువాంగ్ 2007లో సీఈఓ గా అతని వేతనం 24.6 మిలియన్ డాలర్లు అందుకునే స్థాయికి వెళ్లారు.
యునైటెడ్ స్టేట్స్ లో అత్యధిక జీతం తీసుకునే 61 వ్యక్తిగా నిలిచారు.ఈయన కంపెనీ క్యాపిటలైజేషన్ 1. 83 ట్రిలియన్లు. సర్వర్ గా పనిచేసిన హువాంగ్ ప్రస్తుతం 64.2 మిలియన్ల డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో 23వ స్థానంలో ఉన్నారు. సర్వర్ స్థాయి నుంచి ప్రపంచ కుబేరుడు స్థాయికి ఎదిగిన హువాంగ్ జర్నీ ని చూస్తే అంతా సాఫీగా ఏమి జరగలేదు ఈ ప్రయాణంలో అతను ఎన్నో ఒడిదుడుకులు చవిచూసాడు. అయినా పట్టుదలతో వాటిని ఎదుర్కొని అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు.
End of Article