Ads
కొందరు నటులు కామెడీని మాత్రమే పండించగలరు..మరికొందరు విలనిజానికి పెట్టింది పేరు..కానీ తెలుగు సినిమా తెరపై విలన్ గా పరిచయం అయి, తర్వాత తర్వాత కమెడియన్స్ గా మారినవారూ ఉన్నారు..ఒకేసారి రెండిటిని పండించగల నటులు ఉన్నారు..వీళ్లు తమ కామెడీతో మనల్ని పొట్టచెక్కలయ్యేలా నవ్వించగలరు, తమ విలనిజంతో మనల్ని భయపెట్టగలరు..అలాంటి నటుల గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం..
Video Advertisement
#1. కోటా శ్రీనివాసరావు
ఈ జాబితాలో మనకి ముందుగా గుర్తొచ్చే పేరు కోటాశ్రీనివాసరావు.. వామ్మో గణేశ్ సినిమాలోకోటాని చూస్తే మనకి నైట్ కలలోకి వచ్చి భయపెట్టడం ఖాయం..ఆ ఒక్క సినిమా ఏంటి.. ఒక దశలోతెలుగు సినిమాలో విలన్ అనగానే కోటా పేరే వినిపించేదంటే అర్దం చేస్కోవచ్చు..విలన్ గా భయపెట్టినా, కమెడియన్ గా నవ్వించినా, తన నటనతో ఏడిపించినా అది కోటాగారికే చెల్లింది.
#2. ప్రకాశ్ రాజ్
ప్రకాశ్ రాజ్.. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల నటుల్లో ప్రకాశ్ రాజ్ ఒకరు..తండ్రి పాత్రలో ప్రేమ పంచడం మాత్రమే కాదు, విలన్ గా అందరిని భయపెట్టగలిగిన ఈయన కామెడీని కూడా సరైన టైమింగ్ తో పండించగలరు..రేసుగుర్రంలో ప్రకాశ్ రాజ్ నటనకి నవ్వీ నవ్వీ పొట్టచెక్కలవ్వలేదంటే వారికి హాస్యగ్రంధులు లేనట్టే..
#3. జయప్రకాశ్ రెడ్డి
జయప్రకాశ్ రెడ్డి .. ప్రేమించుకుందాం రా సినిమాలో ఈయన నటనకి ప్రేమికులందరికి …అమ్మాయిల తండ్రులు ఇంత భయంకరంగా ఉంటారా అన్నట్టు భయపెట్టారు..తర్వాత తర్వాత ఈయన కమెడియన్ నవ్వించిన సినిమాలు అనేకం..ఏందబ్బీ..అని ఈయన అంటుంటే ఆ డైలాగ్ డెలివరీకే నవ్వొచ్చేసేది..ఈయనేనా మనల్ని భయపెట్టిన విలన్ అని ఆశ్చర్యపోయేలా కామెడిని పండించేవారు జయప్రకాశ్ రెడ్డి.
#4. ప్రదీప్ రావత్
ప్రదీప్ రావత్..ఇలా చెప్తే కన్నా బిక్షూ యాదవ్ అని చెప్తే ఈజీగా గుర్తొస్తారు ఈయన.. సై సినిమాలో ఈయన వేషదారణ, ఆ వాయిస్..అబ్బో ఇలా పేరు తలచుకోగానే అలా మైండ్లో అతని రూపం కనపడి భయంతో గజగజ వణికిపోతాం..అలాంటి ఈయన తర్వాత కమెడియన్ గా నవ్వించారు..నేను శైలజ మూవీలో ప్రదీప్ రావత్ పాత్ర చూసి ఈయనకా మనం భయపడ్డాం అని డౌటొస్తుంది.
#5. షియాజీ షిండే
షియాజీ షిండే.. డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో విలనిజాన్ని పండించే నటుడు..ఒక్క చూపు చూస్తే చాలు భయపడిపోయేలా చేసేవారు..కానీ ఒక్కసారి దుబాయ్ శీనులో షిండే క్యారెక్టర్ గుర్తు తెచ్చుకోండి..పుట్టిన రోజు జేజేలు చిట్టిపాపాయి.. హాహా..
#6. కృష్ణ భగవాన్
కృష్ణ భగవాన్ విలన్ గా చేసారా అని ఆశ్చర్యపోకండి ..చేశారు..అసలాయన ఇండస్ట్రీకి వచ్చింది ఎప్పుడో కానీ లైమ్ లైట్లోకి వచ్చింది మాత్రం చాలా లేట్ గా..దర్శకుడు వంశీ చిత్రం మహర్శి ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన క్రిష్ణవంశీ… తర్వాత ఏప్రిల్ 1 విడుదలలో నెగటివ్ రోల్ పోషించారు..తర్వాత సుమారు పదేళ్లపైనే తెరపైన కనిపంచలేదు..మళ్లీ వంశీ గారి దర్శకత్వంలో వచ్చిన ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమాతో కమెడియన్ గా పరిచయం అయి వెనుదిరిగి చూస్కోకుండా తన కామెడితో ప్రేక్షకులను అలరించారు.
#7. ఆనంద్ రాజ్
ఆనంద్ రాజ్ .. విలనిజానికి పెట్టింది పేరు ఆనంద్ రాజ్..ఈయన విలన్ పాత్రలు పోషించిన సినిమాలు చూస్తే చిన్నపిల్లలకే కాదు పెద్ద వాళ్లకి కూడా భయమే..అలాంటి ఆనంద్ రాజ్ తర్వాత కామెడీని పండించారు.
#8. రఘుబాబు
రఘుబాబు.. ది తన తండ్రి బాటలోనే కామెడీని, విలనిజాన్ని పండించగల నటుడిగా పేరు తెచ్చుకున్నారు..ఒకప్పటి ప్రఖ్యాత నటుడు గిరిబాబు గారి కొడుకే రఘుబాబు..గిరిబాబు కూడా కమెడియన్ గా, విలన్ గా రెండు రకాల పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు..రఘుబాబు కూడా రెండు రకాల పాత్రల్ని పోషించారు..ప్రస్తుతానికి కమెడియన్ గా సెటిల్ అయ్యారు.
#9. అజయ్
అజయ్.. విక్రమార్కుడు సినిమాలో టిట్లాగా అజయ్ పాత్ర ఎప్పటికి గుర్తుండిపోతుంది. అంతకుముందు ఆ తర్వాత అజయ్ ఎక్కువగా నెగటివ్ రోల్స్ పోషించాడు..తర్వాత హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ లోనూ నటించాడు..కొన్ని సినిమాల్లో తన కామెడితో నవ్వించాడు.
#10. సుబ్బరాజు
సుబ్బరాజు ..లాస్ట్ బట్ నాట్ లీస్ట్..అన్నట్టు సుబ్బరాజు కూడా విలక్షణ నటుడు..హీరో కావలసిన అన్ని లక్షణాలు ఉన్నా తెరపై మొదట నెగటివ్ రోల్స్ తోనే పరిచయం అయ్యారు..తర్వాత తర్వాత అన్ని రకాల పాత్రలు పోషించిన సుబ్బరాజు తన హస్యనటనతో ప్రేక్షకులను నవ్వించారు.
వీళ్లు కొంతమంది విలన్లుగా పరిచయం అయి, కమెడియన్లుగా మారిన నటులు..ఆల్ రౌండర్లు.. మేం మిస్ అయిన నటులు మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా ఉంటే..కామెంట్ చేయండి.
End of Article