Ads
టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియా కూడా బాగా అభివృద్ధి చెందుతోంది. పైగా ఇప్పుడు సాధారణ ప్రజలు కూడా హఠాత్తుగా పెద్ద పెద్ద స్టార్ల కింద మారిపోవడం లాంటివి మనం చూస్తున్నాం. చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్స్ గా మారిపోయి భారీగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. వాళ్ళ యొక్క ట్యాలెంట్ తో వీడియోలు చేయడం… వాటి ద్వారా డబ్బులు సంపాదించడం ఇప్పుడు ప్రతి ఒక్కరికీ కామన్ అయ్యిపోయింది. అయితే ఇలానే ఒక చిన్నారి సోషల్ మీడియా ద్వారా నెలకి రూ. 75 వేలకు పైగా సంపాదిస్తున్నాడు. ఆ చిన్నారి వయసు కేవలం ఒక సంవత్సరం మాత్రమే.
Video Advertisement
అదేమిటి ఈ ఏడాది పిల్లవాడు ఎలా అంత డబ్బులు సంపాదించగలడు అని ఆలోచిస్తున్నారా..? అయితే మీరు తప్పకుండా ఆ పసి పిల్లాడి గురించి చూడాలి. ఈ చిన్నారి చేసే పని ఏమిటంటే పలు ప్రాంతాలను పర్యటించడమే. అమెరికాకి చెందిన బేబీ బ్రిగ్స్ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సుర్ గా మారిపోయాడు. పైగా నెలకి రూ. 75 వేల రూపాయలకు పైగా సంపాదిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిన్నారి 45 సార్లు విమానం ప్రయాణం చేసాడు.
మొట్టమొదటి టూర్ మూడు వారాల వయసులోనే ఈ పిల్లవాడు చేశాడని తన తల్లి జెస్ చెబుతోంది. ఏకంగా 30 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఈ పిల్లవాడికి సోషల్ మీడియాలో. అతని తల్లి బ్లాగ్ ని కూడా నడిపిస్తోంది. ఆమె 2020 లో గర్భవతి అయినప్పుడు తన కెరీర్ ఎక్కడ ఆగిపోతుందో అని కంగారు పడిందట. ట్రావెలింగ్ అనేది పిల్లలతో కష్టం అవుతుంది అని ఎంతగానో దిగులు పడిందట. కానీ ఆమె ఎలా అయినా పిల్లవాడితో కూడా ఈ పని చేయాలని నిర్ణయించుకుంది.
ఆమె సోషల్ మీడియా అకౌంట్ లో పిల్లలు ట్రావెలింగ్ అనే దాని కోసం వెతికితే ఎక్కడ ఏమి కనిపించలేదట. ఈ క్రమంలో ఆమె పిల్లవాడితో ట్రావెలింగ్ చేయడం.. ప్రతీది అందరితో షేర్ చేసుకోవడం మొదలుపెట్టింది. పిల్లలతో ప్రయాణం చేసేటప్పుడు కలిగే మంచి చెడులని వర్ణించడం లాంటివి ఈమె చెబుతుంది. ఇది ఇలా ఉంటే ఈ పిల్లవాడికి స్పాన్సర్లు కూడా ఉన్నారు వాళ్ళు అతనికి డైపర్లు, వైప్స్ వంటివి ఇస్తూ ఉంటారు. రానున్న రోజుల్లో ఏకంగా లండన్ తో సహా యూరప్ పర్యటనకు కూడా వెళ్లాలని అనుకుంటున్నారట.
End of Article