ది మిల్క్ మాన్ గా పిలవబడే ఈయన గురించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలు.

ది మిల్క్ మాన్ గా పిలవబడే ఈయన గురించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలు.

by Anudeep

Ads

ఓన్లీ ఇండియన్ మరియు ది మిల్క్ మాన్ గా పిలవబడే ఈయన గుజరాతిలోని జునగడ్ కి చెందిన వ్యక్తి. ఆలయాల్లో దేవుడికి అభిషేకం చేసిన తర్వాత వృధాగా పోయే పాలను పౌష్టిక ఆహార లోపం వల్ల బాధపడే పేద ప్రజలకు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 80 సంవత్సరాల వయసులో సైకిల్ మీద ప్రతి ఆలయానికి వెళ్లి అక్కడ దేవునికి అభిషేకం చేసిన తర్వాత వృధాగా పోయే పాలను సేకరించి వాటిని తీసుకొచ్చి బాగా మరిగించి అవి స్వచ్ఛంగా ఉన్నాయి అని నిర్ధారించుకున్న తర్వాత వాటికి పంచదారను కలిపి మరలా అదే సైకిల్ పైన జునాగడ్ లోని పేద ప్రజలు ఉండే అన్ని ప్రాంతాలకు తిరుగుతూ అక్కడున్న పౌష్టికాహారం లోపంతో బాధపడే పిల్లలకు మరియు మహిళలకు అందిస్తూ ఉంటారు.

Video Advertisement

ఆయన్ని ఎవరైనా పేరు అడిగినప్పుడు తన పేరు ఓన్లీ ఇండియన్ అని చెబుతూ ఉంటారు, కులమత బేధాలు లేకుండా తను అందరికీ సాయం చేయాలనుకున్నానని అందువల్లనే తన పేరు ఓన్లీ ఇండియన్ అని అందరికీ చెప్తూ ఉంటాను అని తెలియజేశారు అంతేకాకుండా అంతేకాకుండా ఓన్లీ ఇండియన్ అనే పేరుతో ఈయన ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నిర్వహిస్తున్నారు బహుశా దేశం మొత్తంలో ఈ పేరుతో ఉన్న స్వచ్ఛంద సంస్థ ఇదేనేమో అంతేకాకుండా పర్యావరణాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత అని కూడా ఆయన భావిస్తూ ఉంటారు అందువలనే సైకిల్ మీద మాత్రమే ప్రయాణం చేస్తూ ఉంటారు. 80 సంవత్సరాల వయసులో కూడా ఆయన చేస్తున్న ఈ సేవ ఎంతో అభినందనీయం, ఎంతో మందికి ఆదర్శం.


End of Article

You may also like