Ads
ప్రస్తుతం పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.
Video Advertisement
దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు. అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వస్తోంది. సినిమాకి ఇంత హైప్ రావడానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు. పాటలు అన్ని కొత్తగా ఉండడంతో ఇది కూడా సినిమాపై ఆసక్తి పెరగడానికి ఒక ప్లస్ పాయింట్ అయ్యింది
అందులోనూ ముఖ్యంగా సమంత చేసిన ఊ అంటావా ఊ అంటావా అయితే ముందు నుండి కూడా చర్చల్లో నిలిచింది. ఈ పాటని ఇంద్రావతి చౌహాన్ పాడారు. ఇంద్రావతి కూడా ఈ ఒక్క పాటతో సడన్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయ్యారు. ఇంద్రావతి ప్రముఖ సింగర్ మంగ్లీ చెల్లెలు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ పాటని కన్నడ భాషలో మంగ్లీ పాడారు.
అయితే, ఇంద్రావతి ఇప్పుడు ఫేమస్ అయినా కూడా అంతకు ముందు చాలా సార్లు స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాటిలో ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇంద్రావతి ఒక జానపద పాడుతున్నారు. వీడియో చూస్తే ఇది ఇంద్రావతి చిన్నప్పటి వీడియో అని అర్ధమైపోతుంది. ఇప్పుడైతే పుష్పలో ఇంద్రావతి పాడిన ఊ అంటావా ఊ అంటావా పాటకు చాలా మంచి స్పందన లభించింది.
watch video :
End of Article