Ads
Ooru Peru Bhairavakona Movie Premiere Review : యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఊరి పేరు భైరవకోన. వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఫాంటసీ అడ్వెంచర్ సినిమాగా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, పాటలు, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఫిబ్రవరి 14న పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..
Video Advertisement
- చిత్రం : ఊరి పేరు భైరవకోన.
- నటీనటులు : సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, తదితరులు..
- నిర్మాత : అనిల్ సుంకర, రాజేష్ దండ.
- దర్శకత్వం : వీఐ ఆనంద్
- సంగీతం : శేఖర్ చంద్ర
- విడుదల తేదీ : ఫిబ్రవరి 16, 2024
స్టోరీ :
బసవ( సందీప్ కిషన్) జాన్ ( వైవా హర్ష) ఇద్దరు స్నేహితులు. ఇద్దరు ఓ దొంగతనం చేసి వెళ్తూ, అనుకోకుండా ఒక ఊర్లో అడుగుపెడతారు. ఆ ఊరి పేరు భైరవకోన. వీరితో పాటుగా గీత ( కావ్య థాపర్) సైతం భైరవకోనలో ఎంటర్ అవుతుంది. అప్పటి నుండి ఈ ముగ్గురికి ఆ ఊర్లో విచిత్ర, భయానక పరిస్థితులు ఎదురవుతాయి. భైరవకోనలో జరిగే ఇన్సిడెంట్స్ భయంకరంగా అనిపిస్తాయి. ఈ టైమ్ లోనే బసవ దొంగలించిన వస్తువును రాజప్ప తీసుకుంటాడు.
బసవ తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించిన కుదరదు. ఆ భైరవకోనకి మిగిలిన ఊర్లకి ఉన్న తేడా ఏంటి? గరుడ పురాణంలో తప్పిపోయిన నాలుగు పేజీలకు భైరవకోనకు సంబంధం ఏమిటి? అందులో ఈ ఊరు గురించి ఏం చెప్పారు. బసవ లవ్ చేసిన అమ్మాయి భూమి( వర్ష బోల్లమ్మ) కోసం దొంగగా ఎందుకు మారాడు? భైరవకోనలో బసవకు ఎదురైన పరిణామాలు ఏమిటి అనేది మిగిలిన కథ.
Ooru Peru Bhairavakona Movie Review రివ్యూ :
ఫాంటసీ సినిమాలుగా వచ్చిన ఆనాటి పాతాళభైరవి నుండి భింబిసార వరకు ఎమోషనల్ మ్యాజిక్ ను క్రియేట్ చేసి, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యి విజయం సాధించాయి. అలా చేయలేకపోయిన ఫాంటసీ సినిమాలు అంతగా విజయం సాధించిన దాఖలాలు లేవని చెప్పవచ్చు. ఎక్కడికిపోతావు చిన్నవాడా సినిమాతో ఆకట్టుకున్న డైరెక్టర్ వి ఐ ఆనంద్ ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఎంగేజింగ్ కంటెంట్, సీటు అంచున కూర్చోబెట్టే సన్నివేశాలు ఉన్నాయి. అయితే లాజిక్ కి దూరంగా, ఎమోషనల్ మ్యాజిక్ చేసే సీన్స్ మిస్ అయ్యాయి.
ప్రధమార్ధంలో బసవ, భూమి లవ్ ట్రాక్, వెన్నల కిషోర్, వైవా హర్షా కామెడీ ఆకట్టుకుంటుంది. మూవీ ట్విస్ట్ ఇంటర్వెల్ వరకు రీవీల్ కాకపోవడంతో మంచి ఫాంటసీ అడ్వెంచర్ సినిమా అనే భావన కలుగుతుంది. సెకండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ గా ప్రారంభం అవడం, స్టోరీలోని ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతున్నా, వాటి వేటికీ ప్రేక్షకులకు అంతగా ఎంగేజ్ అయ్యే విధంగా కనిపించదు. మధ్యలో లవ్ ట్రాక్ సైతం విషాదాంతంతో ముగియడం. క్లైమాక్స్ చాలా బలహీనంగా ఉండడం ఈ సినిమాకి మైనస్ అయ్యింది. కొన్ని ట్విస్ట్స్ అలరిస్తాయి. సినిమాటోగ్రఫీ, సంగీతం, పాటలు, బీజీఎమ్ చక్కగా కుదిరాయి.
నటీనటుల పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే, పెర్ఫార్మన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. హీరోయిన్ గా నటించిన వర్ష బొల్లమ్మ తన పాత్రలో ఒదిగిపోయింది. కావ్య థాపర్ తగినంత స్క్రీన్ స్పేస్ లభించింది. వెన్నెల కిషోర్, వైవా హర్ష కామెడీ ట్రాక్ అదిరిపోయింది. మిగిలిన నటీనటులు పాత్రల మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్ :
- సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ,
- సంగీతం,
- బీజీఎమ్ ,
- సినిమాటోగ్రఫీ,
మైనస్ పాయింట్స్:
- సెకండాఫ్,
- మిస్ అయిన ఎమోషన్
- బలహీనమైన క్లైమాక్స్.
రేటింగ్ :
2.5/5
watch trailer :
End of Article