KGF చాప్టర్-2 లో “పార్లమెంట్‌”గా చూపించిన బిల్డింగ్ ఎదో తెలుసా..? అది ఎక్కడుందంటే..?

KGF చాప్టర్-2 లో “పార్లమెంట్‌”గా చూపించిన బిల్డింగ్ ఎదో తెలుసా..? అది ఎక్కడుందంటే..?

by Mohana Priya

Ads

ఎన్నో రోజులు వెయిట్ చేసిన తర్వాత కేజీఎఫ్ చాప్టర్-2 విడుదల అయ్యింది. కేజీఎఫ్ మొదటి భాగం ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అయ్యింది. మొదటి భాగం మొత్తంలో కూడా రాకీ భాయ్ ఎలా ఎదిగాడు అనేది చూపించారు. రెండవ భాగంలో మాత్రం రాకీ భాయ్ ఎదిగిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది చూపించారు? మొదటి భాగంలాగానే ఈ సినిమా కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది.

Video Advertisement

అసలు రాకీ భాయ్ ని జనాలు అందరూ అంత గుర్తు పెట్టుకునే అంతగా ఏం చేసాడు అనేది ఈ సినిమాలో చూపించారు. కానీ మొదటి భాగంతో పోలిస్తే ఈ సినిమాలో ఎమోషన్స్ కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి. అలాగే విలన్ పాత్ర కూడా మనం చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తుంది. కానీ యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ మాత్రం డైలాగ్స్.

original location of parliament building in kgf chapter 2 movie

ఈ సినిమాలో రవీనా టాండన్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు. సౌత్ సినిమాల్లో రవీనా టాండన్ నటించడం చాలా తక్కువ. ఈ సినిమాలో రవీనా టాండన్ నటించారు. తన పాత్రకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. అయితే ఈ సినిమాలో పార్లమెంట్ అని చెప్పి ఒక బిల్డింగ్ చూపిస్తారు. అది నిజంగా సినిమాకోసం వేసిన సెట్స్ కానీ, లేకపోతే ప్రభుత్వ భవనం కానీ కాదు. ఇన్ఫోసిస్ కంపెనీ మైసూర్ బ్రాంచ్ బిల్డింగ్ అని ఈ విధంగా మనకు చూపించారు.

original location of parliament building in kgf chapter 2 movie

కానీ ఈ సినిమా చూస్తున్నంత సేపు అది పార్లమెంట్ బిల్డింగ్ లాగానే అనిపిస్తుంది. సినిమాలో పార్లమెంట్ కి సంబంధించిన సీన్స్ అక్కడే షూట్ చేశారు. సాధారణంగా ఇది చూసిన వాళ్లకి ఎవరికైనా సరే సినిమా కోసం సెట్ వేసారేమో అనిపిస్తుంది. సినిమా చివరిలో కూడా ఒక ట్విస్ట్ ఇచ్చారు. మరి నిజం గానే నెక్స్ట్ పార్ట్ ఉందా? ఉంటే అందులో ఎం ఉండబోతోంది? వీటి గురించి ప్రస్తుతానికి ఎలాంటి వార్తలు రాలేదు.


End of Article

You may also like