Ads
హారర్ సినిమాలను చూడటానికి చాలామంది ఆసక్తి చూపుతారు. హారర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పవచ్చు. ఈ సినిమాలను కొందరు ఎగ్జైటింగ్ చూస్తుంటారు. మరీ కొందరు మూవీ చూస్తున్నంత సేపు భయపడుతూ ఉంటారు.
Video Advertisement
కొందరు సినిమ చూసినప్పుడు భయపడకున్నా, ఆ తరువాత ఆ మూవీలోని భయపెట్టే సన్నివేశాలను గుర్తు చేసుకుని మరీ భయపడుతుంటారు. కానీ హారర్ సినిమాలను చూడడం మాత్రం మానేయరు. అలాంటి భయపెట్టే ఒక వెబ్ సిరీస్ ‘దహన్’. ఈ సిరీస్ కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
బాలీవుడ్ నటి టిస్కా చోప్రా లీడ్ రోల్ లో నటించిన సిరీస్ దహన్. ఈ సిరీస్ హారర్ థ్రిల్లర్ స్టోరీతో తెరకెక్కింది. 2022 లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో హిందీ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో రిలీజైంది. 9 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్ ప్రస్తుతం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సిరీస్ లో టిస్కా చోప్రా, రాజేశ్ తైలాంగ్, సౌరభ్ శుక్లా, తదితరులు నటించారు.
ఇక ఈ సిరీస్ కథ విషయనికి వస్తే, రాజస్థాన్‌లోని మారుమూల ప్రాంతం శిలాస్ పూర్. ఆ ప్రాంతంలో ఉన్న కొండల్లో చాలా విలువైన ఖనిజాలు ఉంటాయి. ప్రభుత్వం వాటిని బయటికి తీయడానికి ప్రయత్నాలు చేస్తుంటుంది. అయితే అక్కడి ప్రజలు మైనింగ్ పనులు జరగకుండా అడ్డుకుంటారు. మైనింగ్ పనులు జరిగేలా చూడడం కోసం గవర్నమెంట్ కలెక్టర్ అవని (టిస్కా శర్మ)కి అప్పగిస్తుంది. శిలాస్ పూర్ ఓ ఆత్మ వల్ల శపించబడిందని నమ్ముతుంటారు. అక్కడ ఓ ఆత్మను బంధించి, పూజారి(సౌరభ్ శుక్లా) కాపలాగా ఉంటాడు. నిత్యం ఆ ఆత్మ శాంతికి పూజలు చేస్తూ ఉంటాడు. ఊరిలో ఎవరికి ఏం సోకినా పూజారే వదిలిస్తూ ఉంటాడు. ఆ ఊరిలో మరోవైపు మైనింగ్ జరిపించడం కోసం అవని వస్తుంది.
అరుదైన ఖనిజ సంపదను తవ్వనివ్వకుండా కావాలనే కొందరు నాటకాలు ఆడుతున్నారు భావిస్తుంది. ఆ తరువాత ఆమె జీవితంలో కొన్ని ఊహించని ఘటనలు జరుగుతాయి. ఏది వాస్తవం? ఏది అబద్ధం అని తేల్చుకోలేని స్థితికి వస్తుంది. మైనింగ్ మొదలు పెట్టడంతో ఆత్మను బంధించిన రాయికి పగుళ్లు ఏర్పడతాయి. ఆ తర్వాత ఆ గ్రామంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. మనుషులు విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెడతారు. నిజంగా ఆత్మ ఉందా? ఆ ఊరిలో ఏం జరుగుతోంది? మైనింగ్ చేయడానికి, ఆత్మకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి ? చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ.
End of Article