మూడు పదుల వయస్సు దాటినా, ఇంకా పెళ్లి ఊసే ఎత్తని 8 స్టార్ హీరోయిన్లు..! లిస్ట్ ఓ లుక్ వేయండి!

మూడు పదుల వయస్సు దాటినా, ఇంకా పెళ్లి ఊసే ఎత్తని 8 స్టార్ హీరోయిన్లు..! లిస్ట్ ఓ లుక్ వేయండి!

by Anudeep

Ads

ఈ మధ్యకాలంలో ఉన్న నయనతార, డైరెక్ట్ విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకొని ఒక ఇంటి కోడలు అయిందని సంగతి అందరికీ తెలిసిందే. అదేవిధంగా మన చందమామ కాజల్ అగర్వాల్ కూడా వివాహం చేసుకుని ఒక బిడ్డకు తల్లి అయిన సంగతి కూడా తెలిసిందే.

Video Advertisement

కానీ ఇంకా మూడు పదుల వయసు దాటినా  తమ వయసు పెరుగుతుందనే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు మన స్టార్ హీరోయిన్స్. ఇలా వివాహాన్ని ఆలస్యం చేస్తున్న వారిలో మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్టు బాగానే ఉంది.

మరి పెళ్లి వయసు దాటుతున్నా అసలు పెళ్లి ఊసే ఎత్తని  స్టార్ హీరోయిన్స్ ఎవరో ఒకసారి లుక్కేద్దాం రండి.

#1. అనుష్క:

Anushka

మన టాప్ టాలీవుడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అనుష్క వయస్సు 40 సంవత్సరాలు. గత ఏడాది పెళ్లి పీటలు ఎక్కబోతున్న అనుష్క అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు ప్రచారమైన, పెళ్లి విషయంపై ఇప్పటి వరకు అనుష్క ఒక సరైన క్లారిటీ ఇవ్వలేదు.

#2. తమన్నా భాటియా:

Thammana

శ్రీ చిత్రంతో మన టాలీవుడ్ లోకి ఎంత ఇచ్చింది తమన్నా. ఇప్పుడు తమన్నా ప్రస్తుత వయస్సు 33 సంవత్సరాలు. ఈ భామ కూడా ఇప్పటివరకు పెళ్లి ఊసే ఎత్తటం లేదు.

#3 నిత్యా మీనన్ :

Nitya menon

అలా మొదలైంది చిత్రంతో మన టాలీవుడ్కి ఎంట్రి ఇచ్చింది నిత్యమీనన్. ఇప్పటి కూడా నిత్యామీనన్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమె ప్రస్తుత వయసు 35 సంవత్సరాలు.

#4. ఛార్మి :

Charmi

2001లో  నీతోడు కావాలి చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఛార్మి. దాదాపు ఇండ్రస్టీకి వచ్చి 22 సంవత్సరాలు పూర్తిగా పోతుంది. ఇప్పటి ఉన్న అందరికీ హీరోయిన్స్ కన్నా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని చెప్పవచ్చు చార్మిని. ఇప్పుడు ఛార్మి ప్రస్తుత వయసు 36 సంవత్సరాలు.

#5. త్రిష :

Trisha

చార్మి తర్వాత సీనియర్ హీరోయిన్ త్రిష. త్రిష అనేక భాషల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. నీ మనసు నాకు తెలుసు అనే చిత్రంతో తరుణ్ పక్కన హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన త్రిష ప్రస్తుత వయసు 40 సంవత్సరాలు.

#6. శృతిహాసన్ :

Srurhi hassan

మన లోకనాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీకి  పరిచయమైంది శృతిహాసన్. శృతి హాసన్ ప్రస్తుతం వయసు 37 సంవత్సరాలు.

#7. రకుల్ ప్రీతిసింగ్ :

ఇప్పటి తరం స్టార్ హీరోలందరితో ఆడిపాడిన రకుల్ ప్రీతిసింగ్ వయసు 32 సంవత్సరాలు.

#8. సాయి పల్లవి :

Sai pallavi

హైబ్రిడ్ పీస్ ఒక్కతే పిల్ల అంటూ ఫిదా చిత్రంతో మన తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సాయిపల్లవి. ఎన్నో కొత్త కథనాలతో దూసుకుపోతుంది సాయి పల్లవి. ఈమె ప్రస్తుత వయసు 31 సంవత్సరాలు

మరీ ఈ అందాల ముద్దుగుమ్మలందరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కి ఒక ఇంటివారు అవుతారా లేదా అనేది వేచి చూడాలి.


End of Article

You may also like