కార్ డ్రైవర్ ని పెళ్లి చేసుకున్న ఓనర్ కూతురు.. పెళ్లయ్యాక అసలు విషయం తెలిసేసరికి.. లాస్ట్ లో ట్విస్ట్ ఏంటంటే…?

కార్ డ్రైవర్ ని పెళ్లి చేసుకున్న ఓనర్ కూతురు.. పెళ్లయ్యాక అసలు విషయం తెలిసేసరికి.. లాస్ట్ లో ట్విస్ట్ ఏంటంటే…?

by Anudeep

Ads

ఇటీవల ఓ కార్ ఓనర్ కూతురు డ్రైవర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ఆ డ్రైవర్ ఆమెను ప్రతి రోజు కాలేజీ కి తీసుకు వెళ్లి, తిరిగి ఇంటికి తీసుకొచ్చేవాడు. ఒక్కోసారి కార్ లో, లేకపోతే బైక్ పై ఆమెను తీసుకెళ్తూ ఉండేవాడు. ఇలా వీరి మధ్య స్నేహం మొదలైంది.

Video Advertisement

ఆ స్నేహం ప్రేమగా మారింది. ఈ క్రమంలో సదరు యువతి తన కుటుంబాన్ని ఎదిరించింది. పెద్దలను కాదని, ప్రేమించిన డ్రైవర్ తో వెళ్ళిపోయింది.

akshitha

వివరాల్లోకి వెళితే, కర్ణాటకలోని విజయపుర జిల్లా జాలగేరి గ్రామానికి చెందిన ఓ పెద్దింటి కుటుంబానికి సోమలింగ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆ ఓనర్ కూతురు అక్షితను ప్రతి రోజు కాలేజీ దగ్గర దింపేవాడు. ఈ క్రమంలో వీరు ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అక్షిత కుటుంబం అందుకు అడ్డు చెప్పింది. దీనితో.. అక్షిత ఇంట్లోంచి వెళ్ళిపోయి సోమలింగాన్ని గుడిలో పెళ్లి చేసుకుంది.

akshita

అప్పటికే సోమలింగానికి పెళ్లి అయ్యింది. సోమలింగానికి భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో అక్షిత తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అయితే అక్షిత మాత్రం ఈ విషయం తనకు ముందే తెలుసు అని చెప్పింది. తాను ఇష్టపడే సోమలింగాన్ని పెళ్లి చేసుకున్నానని, అతనికి రెండో భార్యగా ఉండడానికి అభ్యంతరం లేదని చెప్పి అసలు ట్విస్ట్ ఇచ్చింది. ఇంకో విషయం ఏంటంటే తన ఫ్యామిలీ నుంచి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని కోరింది. అయితే.. ఆమె మేజర్ కావడంతో పోలీసులు ఏమి చేయలేక ఊరుకున్నారు.

 


End of Article

You may also like