విశ్వక్ సేన్, నివేత పేతురాజ్ ప్రధాన పాత్రల్లో  వచ్చిన చిత్రం ‘పాగల్’ . ఈ చిత్రానికి నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించగా.. దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ లక్కీ మీడియా బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఇటీవల ఆగస్ట్ 14న ఎన్నో అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.  ఈ చిత్రం ఓటీటీ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో ద‌క్కించుకుంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా సెప్టెంబర్ 3న స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసింది అమెజాన్ ప్రైమ్.

చిత్రం: పాగల్‌
నటీనటులు: విశ్వక్‌ సేన్‌, నివేత పేతురాజ్, సిమ్రన్‌ చౌదరీ, మేఘలేఖ, మురళీశర్మ, తదితరులు.
నిర్మాత: బెక్కెం వేణుగోపాల్‌
సంగీతం: రాధన్‌
దర్శకుడు: నరేశ్‌ కొప్పిలి
నిర్మాణ సంస్థ: శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా
ఓటీటీ సంస్థ : అమెజాన్ ప్రైమ్
ఓటీటీ స్ట్రీమింగ్ : సెప్టెంబర్ 3