పాముని చూడగానే అవి విషసర్పాలు అని కాటు వేస్తే వాటి వల్ల చనిపోతారు అనే విషయం అందరికీ తెలుసు అందువల్లనే వాటిని చూసి భయాపడుతు ఉంటాం కానీ ఇప్పుడు అదే పాముల విషం కరోనా నుండి మనల్ని రక్షించే ఔషధం కాబోతుంది. కరోనా వైరస్ సోకడం ప్రారంభించినప్పటి నుంచి శాస్త్రవేత్తలు ఎన్నో రకాల పరిశోధనలు చేస్తూ ఉన్నారు. కరోనాకి ఎన్నో రకాల ఔషధాలను, వాక్సిన్ లను కనిపెట్టారు కూడా, అయినప్పటికీ అవి అంతగా ఆశించినంత ఫలితాలు ఇవ్వలేకపోవడంతో శాస్త్రవేత్తలు వాటి కన్నా మెరుగైన ఔషధాలను కనిపెట్టే పనిలో పడ్డారు దానిలో భాగంగానే బ్రెజిల్ కు చెందిన ఒక రకమైన రక్త పింజరి పాము యొక్క విషయంలో కరోనాకు ఔషధంగా పనికివచ్చే గుణాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ ప్రయోగాన్ని మొదటగా ఒక కోతి పై చేశారు ఇది కరోనా వ్యాప్తిని ఆపడంలో 75 శాతం వరకు మెరుగైన ఫలితాలను చూపించింది. అంతేకాకుండా ఇది కరోనా కణాల మీద తప్పా శరీరంలోని వేరే ఏ ఇతర కణాల మీద ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపించడం లేదని కూడా తెలియజేశారు. రక్తపింజరి పాములో దొరికే ఈ విషాన్ని సంపాదించడం కోసం పాములను హింసించాల్సిన అవసరం లేదని ఈ విషాన్ని ప్రయోగశాలలో కృత్రిమంగా తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఈ విషంతో తయారైన ఔషధం కరోనాను తరువాత దశలలో రాకుండా ఎంతవరకు అడ్డుకుంటుంది అనే ప్రయోగాన్ని కూడా చేయాల్సి ఉంటుందని ఫలితాలను పరిశీలించిన మీదట మనుషులపై క్లినికల్ ట్రైల్స్ నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు