107 మందిలో ప్రాణాలతో బయటపడింది ఇద్దరే…ప్రమాదానికి ముందు ఏం జరిగిందంటే?

107 మందిలో ప్రాణాలతో బయటపడింది ఇద్దరే…ప్రమాదానికి ముందు ఏం జరిగిందంటే?

by Anudeep

Ads

పాకిస్థాన్‌లో  జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది.. చూస్తుండగానే కళ్లముందు 105మంది ప్రాణాలు పోయాయి..చిన్నారుల దగ్గర నుండి ముసలి వారి వరకు ఒక పది నిమిషాలు గడిస్తే ప్రాణాలతో బయటపడేవారు..కానీ మనం అనుకున్నట్టు జరిగితే అది విధి ఎందుకవుతోంది.. అంత పెద్ద ప్రమాదం నుండి ఎవరైనా బతకగలరని ఊహించగలమా.కానీ మొత్తం 107మందిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడగలిగారు..వారిలో ఒకరే జుబైర్..విమాన ప్రమాదానికి ముందు ఏం జరిగింది అనే విషయాన్ని మీడియాతో పంచుకున్నారు జుబైర్.

Video Advertisement

మరో పది నిమిషాలైతే విమానం దిగిపోయేవాళ్లమే.. ల్యాండ్ కాబోతున్నాం, సీటు బెల్టులు ధరించండి అని పైలట్ కూడా చెప్పారు..కానీ ఇంతలోనే మూడు సార్లు విమానం కుదుపులకు గురైంది.దాంతో విమానంలో వారంతా ఏడుస్తున్నారు, అరుస్తున్నారు…విమానం నెమ్మదిగా కిందకి దిగుతుంటే ల్యాండ్ అవుతుందేమో అనుకున్నాం..అందరూ పరుగులు పెట్టారు..రన్ వే పైకి వెళ్లిన విమానం మళ్లీ పైకి తీసుకెళ్లాడు పైలట్..ఏం జరుగుతుందో అర్దం కాలేదు…10-15 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టించిన  తర్వాత విమానం ల్యాండ్ కాబోతున్నట్టు పైలట్ నుంచి మళ్లీ  అనౌన్స్‌మెంట్ వచ్చింది.

అప్పుడు నేను కిందికి చూశాను. మాలిర్ కంటోన్మెంట్ ప్రాంతం  కనిపించింది. ఇక ల్యాండ్ కావడమే ఆలస్యం అనుకుని ఊపిరిపీల్చుకోబోయాం.. కానీ ఒక్కసారిగా మంటలు రావడం మొదలయింది..  విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. విమానం క్రాష్ అవ్వగానే నేను స్పృహ తప్పి పడిపోయాను.తెలివి వచ్చేసరికి చుట్టూ పొగలు కమ్ముకుని ఉన్నాయి..అని వివరించాడు జుబైర్.

లాహోర్ నుండి కరాచి బయల్దేరిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) ఎయిర్ బస్ ఎ-320లో 99మంది ప్రయాణికుల 8మంది సిబ్బంది ఉన్నారు.వారిలో సిబ్బంది మొత్తం మరణించగా ప్రయాణికులు 97మంది చనిపోయారు..వారిలో 9మంది అభంశుభం తెలియని చిన్నారులు ఉన్నారు.. ప్రస్తుతం జుబైర్ కరాచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. జుబైర్ తో పాటు మరో వ్యక్తి కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డాడు..అతడి పేరు జాఫర్ మసూద్..అతడు బ్యాంక్ ఆఫ్ పంజాబ్ సిఇఓ గా పనిచేస్తున్నారు.

Also read: ప్లేన్ క్రాష్ అయ్యే ముందు ఆ పైలట్ “మే డే” అని 3 సార్లు అన్నారు…అంటే ఏంటి?


End of Article

You may also like