పైలట్ స్పీడ్ తగ్గించమన్నా వినలేదంట!

పైలట్ స్పీడ్ తగ్గించమన్నా వినలేదంట!

by Anudeep

Ads

పాకిస్తాన్ విమాన ప్రమాదానికి కారణం పైలట్ నిర్లక్ష్యం అని తాజాగా ఒక నివేధికలో వెల్లడైంది. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఎత్తులో విమానం ఉండడం, విమాన ప్రయాణ వేగం ​ కూడా ఎక్కువగా ఉండడం వల్లే ​ ఫ్లైట్​ కూలిపోయిందని ప్రమాదంపై ఏర్పాటైన ఎంక్వైరీ కమిటీ ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది. పైలట్ ని  ఎయిర్​ ట్రాఫిక్​ కంట్రోల్(ATC) హెచ్చిరించినా పైలట్​ వినిపించుకోలేదని సివిల్​ఏవియేషన్ అథారిటీ(CAA) రిపోర్టు వెల్లడించింది.

Video Advertisement

ఇటీవల పాకిస్తాన్​ లాహోర్​ నుంచి కరాచీ వెళుతున్న పీకే–8303 విమాన ప్రమాదం సంభవించిన విషయం విదితమే . ఈ ప్రమాదంలో 97 మంది ప్రయాణికులు , 8మంది సిబ్బంది చనిపోగా, ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదానికి కారణం విమానంలో సంభవించిన సాంకేతిక లోపమే కారణం అని తొలుత భావించినప్పటికి..ఏటీసీ డైరెక్షన్లను పైలట్ ​పట్టించుకోకపోవడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

సాధారణంగా ల్యాండింగ్​ టైమ్​లో విమానం రన్​ వే ను సమీపిస్తున్న కొద్దీ ఎత్తును, వేగాన్ని పైలట్​ నెమ్మదిగా తగ్గిస్తారు. విమానం రన్​వేకు ఎంత దూరం ఉందనే దానిని బట్టి అది ఎగరాల్సిన హైట్​ను, స్పీడ్​ను ఏటీసీ సూచిస్తుంది. దీనికోసం నిర్దేశిత ప్రమాణాలను పాటించాలి. పీకే 8303 విమానం పైలట్​ మాత్రం ఈ వార్నింగ్​లను లెక్కచేయలేదని ప్రాథమిక రిపోర్టులో వెల్లడైంది.

ఎయిర్​ పోర్టు మరో 15 నాటికల్​ మైల్స్ ఉందనగా ఫ్లైట్​ 7 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించాల్సి ఉండగా.. పీకే 8303 మాత్రం 10 వేల అడుగుల హైట్​లో ప్రయాణించిందని ఏటీసీ అధికారులు చెప్పారు. తర్వాత 10 నాటికల్​ మైల్స్ దగ్గర్లోకి వచ్చాక 3 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించాల్సిన విమానం 7 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించిందని అన్నారు..విమాన వేగం, ఎత్తు గురించి పైలట్ కి వార్నింగ్ ఇచ్చామని, పరిస్థితిని తాను హ్యాండిల్ చేయగలనని అన్నాడని ఎటిసి అధికారులు చెప్పారు.

ఉండాల్సిన స్పీడ్​ కన్నా చాలా ఎక్కువ స్పీడ్​లో రన్​ వేను అప్రోచ్ కావడంతో  ఫ్లయిట్​ కింది భాగం రన్​వేను తాకి ఆయిల్​ ట్యాంకర్​కు పగుళ్లు ఏర్పడి, ఆయిల్​ లీక్​ అయిందన్నారు. ల్యాండింగ్​ అటెంప్ట్​ ఫెయిల్​ కావడంతో పైలట్​ విమానాన్ని మళ్లీ పైకి తీసుకెళ్లి, రెండోసారి ల్యాండ్​ చేసేందుకు ట్రై చేశాడని, ల్యాండింగ్​ గేర్ ట్రబుల్​ ఇవ్వడంతోనే మళ్లీ గాల్లోకి లేచినట్లు చెప్పిన పైలట్.. రెండో అటెంప్ట్​లోనూ ఫ్లైట్​ను ల్యాండ్​ చేయలేకపోయాడు. ఆ తర్వాత మరోసారి ల్యాండింగ్​కు ట్రై చేయగా.. అప్పటికే ఆయిల్​ ట్యాంక్​ లీక్​ కావడం, కిందిభాగం దెబ్బతినడంతో ఫ్లయిట్​ కూలిపోయిందని సివిల్ ఏవియేషన్ ​అథారిటీ రిపోర్టు వెల్లడించింది.

లాహోర్​ నుంచి కరాచీకి ట్రావెల్​ టైమ్​  అయితే ఫ్లయిట్​లో రెండున్నర గంటల పాటు ప్రయాణించేందుకు అవసరమైన ఫ్యూయెల్​ ఉందని,ప్లైట్ కండిషన్ కూడా బాగుందని పేర్కొన్నారు..ప్రమాదానికి సంబంధించిన పూర్తి రిపోర్టుని  విచారణ కమిటీ మూడు నెలల్లో ఇస్తుందని అధికారులు చెప్పారు.


End of Article

You may also like