Ads
అయోధ్యలో రామ మందిరం నిర్మాణం మరియు శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ నిర్వహించడం పై ప్రపంచ వ్యాప్తంగా ఇండియా పై అభినందనలు, ప్రశంసలు వెల్లువెత్తాయి. కానీ పాకిస్థాన్ ఎప్పటిలాగానే తన బుద్ధిని చూపించింది. రామ మందిరం నిర్మాణం పై విమర్శలు చేసింది.
Video Advertisement
సుప్రీం కోర్టు అయోధ్యలో రామమందిరంను నిర్మించాలని తీర్పు ఇచ్చినప్పటి నుండి వ్యతిరేకతను పాకిస్థాన్ ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంది. రామ మందిరం ప్రాణప్రతిష్ఠ వేళ అయోధ్య పై ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపన మహోత్సవం ఎంతో దివ్యంగా, అంగరంగ వైభవంగా జరిగింది. అయోధ్యలో దశాబ్దాల తర్వాత బాబ్రీ మసీదు వివాదం ముగిసి, సుప్రీం కోర్టు తీర్పుతో రామ మందిర నిర్మాణం జరిగింది. 500 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న రామ మందిర ప్రారంభోత్సవంతో భక్తుల చిరకాల కోరిక నెరవేరింది. రామ మందిర ప్రతిష్ఠాపన మహోత్సవంలో ముస్లింలు కూడా పాల్గొనడం ఆమోదించలేని పాకిస్థాన్, రామ మందిరం పై ఫిర్యాదు చేస్తూ ఐక్యరాజ్యసమితికి అధికారికంగా లేఖ రాసింది.
భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడటంలో ఎప్పుడూ అలసిపోని పాక్ నాయకులలో మునీర్ అక్రమ్ ఒకరు. పాకిస్తాన్ రాయబారి ఉన్న మునీర్ అక్రమ్ రామ మందిరం పై ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. అందులో
“భారతదేశంలోని అయోధ్యలో కూల్చివేసిన బాబ్రీ మసీదు స్థలంలో రామమందిరాన్ని నిర్మించి, ప్రతిష్టించడాన్ని పాకిస్థాన్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు పాక్ రాయబారి మునీర్ అక్రమ్ ఐక్యరాజ్యసమితికి పంపిన లేఖలో రాశారు.ఈ ధోరణి భారతీయ ముస్లింల సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ శ్రేయస్సుతో పాటు ఈ ప్రాంతంలో సామరస్యం మరియు శాంతికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. భారతదేశంలోని ఇస్లామిక్ వారసత్వ ప్రదేశాల రక్షణ కోసం తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బాబ్రీ మసీదు లాగే భారతదేశంలోని ఇతర మసీదులు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు, మథురలోని షాహీ ఈద్గా మసీదుతో సహా ఇతర మసీదులు ఎన్నో అవమానాలు మరియు విధ్వంసాన్ని ఎదుర్కొంటున్నాయని పాకిస్థాన్ లేఖలో వెల్లడించింది.
Also Read: “రాముడికి 1000 మంది మహిళలతో సంబంధం, అంతే కాదు.?”.. ఇంత అసభ్యంగా కామెంట్స్ చేసిన ఈమె ఎవరు.?
End of Article