గేదెని ఇంటర్వ్యూ చేసిన పాకిస్తాన్ జర్నలిస్ట్..! కామెంట్లలో ఇచ్చిపడేస్తున్న నెటిజన్లు..!

గేదెని ఇంటర్వ్యూ చేసిన పాకిస్తాన్ జర్నలిస్ట్..! కామెంట్లలో ఇచ్చిపడేస్తున్న నెటిజన్లు..!

by Anudeep

Ads

ఎవరైనా మనుషులను, సెలెబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తారు. కానీ ఓ పాకిస్థాన్ జర్నలిస్ట్ మాత్రం గేదె ని ఇంటర్వ్యూ చేసాడు. గేదెని ఇంటర్వ్యూ చేయడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా..? అతను ఇంటర్వ్యూ చేయడం మాత్రమే కాదు.. ఆ గేదె ఏమి చెప్పిందో కూడా తిరిగి చెప్తున్నాడు. టీఆర్పీల కోసమే చేస్తున్నారో.. లేక ఫన్నీ గా చేస్తున్నారో తెలియదు కానీ.. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

Video Advertisement

amin 1

ఇలా డిఫరెంట్ ఇంటర్వ్యూ లు చేయడం లో పాకిస్థాన్ కు చెందిన అమిన్ హఫీజ్ అనే జర్నలిస్ట్ కు మంచి గుర్తింపు ఉంది. ఇలా రకరకాల వస్తువులను, జంతువులను ఇంటర్వ్యూ లు చేస్తూ అమిన్ నవ్విస్తూ ఉంటారు. అవి ఎలా హావభావాలు ఇస్తున్నాయి దానికి తగ్గట్లు ఆయన సమాధానాలు చెబుతూ నవ్విస్తుంటారు. తాజాగా.. ఓ గేదెల మార్కెట్ వద్దకు వెళ్లిన అమిన్ ఆ గేదెని ఇంటర్వ్యూ చేసారు.

amin 2

మీకు లాహోర్ వచ్చినందుకు ఎలా అనిపించింది..? అని అడగ్గా ఆ గేదె అంబా అని సౌండ్ చేసింది. కెమెరా వైపుకు తిరిగిన అమిన్ గేదెకు లాహోర్ బాగా నచ్చింది అంటూ సమాధానం కూడా తానే చెప్పాడు. అక్కడితో ఆగకుండా.. లాహోర్ లో ఫుడ్ బాగుందా..? లేకపోతే మీ ఊరిలోనే ఫుడ్ బాగుందా అంటూ నాన్ స్టాప్ గా ప్రశ్నలు సంధించాడు. ఆ గేదె మళ్ళి అంబా అని అరిచేసరికి.. లాహోర్ లోనే ఫుడ్ బాగుందట అంటూ అందరికి వివరించాడు. పాకిస్థాన్ లో ఆయన వీడియోస్ బాగా పాపులర్. ఫన్నీ గా ఉండడం తో అందరు వీటిని ఎంజాయ్ చేస్తుంటారు.

amin 3

ప్రస్తుతం అమిన్ జియో టివి రిపోర్టర్ గా చేస్తున్నారు. ఆయన ఇంటర్వ్యూ చేసే విధానం ప్రత్యేకం గా ఉంటుంది. ఏది ఇంటర్వ్యూ చేయబోతున్నా.. అక్కడి వాతావరణానికి తగ్గట్లు గెటప్ వేసుకుని ఇంటర్వ్యూ చేయడం ఆయన ప్రత్యేకత. ఈ గేదె ఇంటర్వ్యూ వీడియో మాత్రం బాగా వైరల్ అయింది. నెటిజన్లు కూడా ఓ రేంజ్ లో కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియో ను మీరు కూడా ఇక్కడ చూడచ్చు.


End of Article

You may also like