ఒకప్పుడు సీరియల్స్ లో నటించిన… ఇప్పటి “పాన్-ఇండియన్” స్టార్ నటిని గుర్తుపట్టారా..?

ఒకప్పుడు సీరియల్స్ లో నటించిన… ఇప్పటి “పాన్-ఇండియన్” స్టార్ నటిని గుర్తుపట్టారా..?

by Mohana Priya

Ads

సినిమాల్లోకి వచ్చే ముందు ఆ రంగానికి చెందిన వాళ్లు అందరూ చాలా కష్టాలు పడతారు. చిన్న చిన్న పాత్రల్లో నటించి లేదా కెమెరా వెనకాల పని చేసి ఇప్పుడు పెద్ద స్థాయికి ఎదిగిన నటులు ఎంతోమంది ఉన్నారు. ఇదేవిధంగా, ఇటీవల కాలంలో పేరు తెచ్చుకుంటున్న కొంతమంది నటులు కూడా కూడా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు.

Video Advertisement

కొంతమంది నటులు అయితే సినిమాల్లోకి వచ్చే ముందు సీరియల్స్ లో కూడా నటించారు. అలా ఇప్పుడు పాన్ ఇండియన్ నటిగా పేరు తెచ్చుకున్న ఒక్కరు కూడా అంతకుముందు సీరియల్ లో నటించారు. తనే కేజీఎఫ్ సినిమాలో హీరో తల్లిగా నటించిన అర్చన జోయిస్.

అసలు రాకీ భాయ్ పాత్ర డెవలప్ అవ్వడానికి ముఖ్యకారణం తన తల్లి చెప్పిన మాటలే. రాకీ భాయ్ తల్లి శాంతమ్మ పాత్రలో నటించారు అర్చన జోయిస్. అర్చన పోషించిన పాత్ర సినిమాకి ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. అంత ఇంపార్టెంట్ పాత్రని అంతే బాగా హ్యాండిల్ చేశారు అర్చన. అర్చన విజయ రథ, కాలాంతక సినిమాల్లో నటించారు. సాధారణంగా సినిమాలో పాత్రకి తగ్గట్టు రెడీ అవ్వడం వల్ల, యాక్టర్స్ రియల్ లైఫ్ ఫీచర్స్ కి, సినిమాలో ఉన్న దానికి చాలా తేడా ఉంటుంది.

pan indian star actress was seen in a serial

అలాగే అర్చన రియల్ లైఫ్ ఫొటోస్ చూస్తే, అసలు మనం సినిమాలో చూసిన అర్చనకి, నిజ జీవితంలో ఉన్న అర్చనకి చాలా డిఫరెన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. మహాదేవి అనే ఒక సీరియల్ లో అర్చన అంతకుముందు నటించారు. తర్వాత కొన్ని సినిమాల్లో కూడా అర్చన నటించారు. కేజీఎఫ్ సినిమాలో అర్చన పాత్ర ఉన్నది కొంచెం సేపు అయినా కూడా సినిమా మొత్తం అర్చన పాత్ర మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటారు. కేజీఎఫ్ తర్వాత అర్చన నటించిన కొన్ని సినిమాలు విడుదల కూడా అయ్యాయి. ఇప్పుడు కేజీఎఫ్ మూడవ పార్ట్ లో కూడా అర్చన పాత్ర కనిపించే అవకాశాలు ఉన్నాయి.

watch video : 


End of Article

You may also like