Ads
విడాకులు.. ఇప్పుడు ఈ పదం ఎంత కామన్ అయిపోయిందంటే ప్రతి చిన్న విషయానికి విడాకులు సొల్యూషన్ అనే స్టేజ్ కి వచ్చేసారు నేటి జనరేషన్. ఒకప్పుడు మూడు ముళ్ళతో ఒకటైన జంటని చావు తప్పితే వేరేది దూరం చేసే శక్తి ఉండేది కాదు. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు కనుమరుగైపోయింది. అయితే విడాకులు యొక్క ప్రభావం ఇద్దరు వ్యక్తులపైనే కాకుండా వారి పిల్లల పైనా, ఇరు కుటుంబాల పైనా పడుతుంది.
Video Advertisement
ముఖ్యంగా పిల్లలు వారి తల్లిదండ్రులు విడిపోవటాన్ని తట్టుకోలేరు. అప్పటివరకు తల్లిదండ్రులతో కలిసి ఉన్న పిల్లలు ఇప్పుడు ఏ ఒక్కరి దగ్గరో ఉండాలంటే అంత త్వరగా అలవాటు పడలేరు. కాబట్టి తల్లిదండ్రులు సహనంగా ఉండి వాళ్ల మీద ఎక్కువ శ్రద్ధ చూపించే సమయం ఇది. విడాకులు తీసుకున్న జంటలు పిల్లల కోసం స్నేహితులుగా మారవచ్చు. ఆ స్నేహ బంధమే మీ పిల్లలకు తల్లిదండ్రుల దూరమయ్యారనే బాధని లేకుండా చేస్తుంది.
అలాగే మీరు విడాకులు తీసుకోవడానికి గల కారణాలు అర్థమయ్యేలాగా పిల్లలకి చెప్పండి. మీరు మీ జీవిత భాగస్వామికి దూరమయ్యారు కాబట్టి మీ పిల్లలని కూడా దూరం చేసే ప్రయత్నం చేయకండి. వీలైనంత వరకు పిల్లల పుట్టిన రోజులు, స్కూల్ ఫంక్షన్స్ కలిసి అటెండ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. వారి జీవితానికి సంబంధించిన నిర్ణయాలను వారితోపాటు మీ ఇద్దరు కలిసి కూర్చొని చర్చించుకోవడం ద్వారా పిల్లలు యొక్క భవిష్యత్తు, మానసిక స్థితి సరైన పద్ధతిలో ఉంటుంది.
లేదంటే పిల్లల మనసులో వివాహ వ్యవస్థ మీద చెడుముద్ర పడుతుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో మీ పిల్లలకి దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడితే వారు మిమ్మల్ని మిస్ అవ్వకుండా రోజు ఫోన్లో మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం వంటివి చేయండి. కుదిరితే చిన్న వెకేషన్ ప్లాన్ చేసుకోండి. అలాగే విడాకులు తీసుకున్న ఫ్రస్టేషన్ లో ఉన్న పేరెంట్స్ వారి యొక్క ఒత్తిడిని పిల్లలపై చూపించకుండా జాగ్రత్త పడండి.
End of Article