ఇటీవలే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం వాలెంటీర్లని అడ్డుపెట్టుకుని ఓటర్లను భయబ్రాంతులని చేసిందని ఆరోపించారు పరిటాల శ్రీరామ్.ఈ ప్రభత్వం లో ఎక్కడేకాని అభివృద్ధి అన్నదే లేదని వైసీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు,త్వరలోనే గ్రామాల్లోని ప్రజలు ఎదురు తిరిగే రోజులు వస్తాయని చెప్పారు.వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాయడం ఖాయమని ఇవాళ జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాప్తాడులో వేడుకల్ని నిర్వహించగా ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెప్పుకొచ్చారు.

Video Advertisement

paritala-sriram

paritala-sriram

అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి పక్షం అంటే గౌరవం లేకుండా పోయిందని ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు.టీడీపీ కార్యకర్తలని పరామర్శించడానికి వెళితే అక్రంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు,అసలు ఈ రాష్ట్రంలో పాలన అన్నదే లేదని ఒక కంపెనీలాగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు పరిటాల శ్రీ రామ్ టీడీపీ పాలనలోనే ఈ రాష్ట్రం ఎంతో ప్రశాంతగా ఉండేదని చెప్పుకొచ్చారు.

also check : జనసేన, బీజేపీల మీద వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్