Ads
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ స్టార్ అనే గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్. అప్పటి వరకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న క్రేజ్ బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పెరిగింది. మిర్చి తర్వాత బాహుబలిలో ప్రభాస్ నటించారు. బాహుబలిలో ప్రభాస్ అసలు అప్పటి వరకు నటించని ఒక పాత్రలో నటించారు. అందుకోసం చాలా కష్టపడ్డారు.
Video Advertisement
అందుకు తగ్గట్టుగా ఫలితం కూడా వచ్చింది. దాంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఏంటి అని అందరూ ఎదురు చూశారు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో కూడా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని పాన్ ఇండియన్ సినిమాగా విడుదల చేసారు. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలని అందుకోలేకపోయింది. ఇటీవల విడుదల అయిన రాధే శ్యామ్‌కి వచ్చిన రెస్పాన్స్ కూడా అలాగే ఉంది.
ఈ సినిమాపై ప్రముఖ నటులు పరుచూరి గోపాల కృష్ణ రివ్యూ ఇచ్చారు. ఇందులో గోపాల కృష్ణ మాట్లాడుతూ సినిమా ఇలా రావడానికి కారణాలు ఏంటో చెప్పారు. “ఈ సినిమాని చూస్తూ ఉంటే పాతాళభైరవి అలాగే పాత మల్లీశ్వరి సినిమాలు గుర్తొచ్చాయి” అని అన్నారు. తన అంచనా ప్రకారం ఒకవేళ పాతాళభైరవి కంటే ముందు మల్లీశ్వరి విడుదల అయ్యి ఉంటే సూపర్ హిట్ అయ్యేది అని అన్నారు.
అలాగే “రాధే శ్యామ్ సినిమాలో పాటలు మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే లాగా లేవు” అని అన్నారు. అలాగే ఫైట్స్ కూడా మిస్ అయ్యాయి అని అన్నారు. అల్లూరి సీతారామరాజు సినిమా తర్వాత కృష్ణ నటించిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అని అలాగే రాధే శ్యామ్ కి కూడా జరిగింది అని అన్నారు. సినిమా లైన్ బాగున్నా కూడా టైటిల్ కరెక్ట్ కాదు అని అన్నారు. అంతే కాకుండా ఈ సినిమా చూడాలి అని చెప్పారు. పరుచూరి గోపాల కృష్ణ ఈ సినిమా గురించి చెప్పిన వాటిపై చాలా మంది నెటిజన్లు కూడా కరెక్ట్ అని అంటున్నారు.
watch video :
End of Article