ఈ కొత్త రైల్వే రూల్స్ మీకు తెలుసా..??

ఇండియన్ రైల్వేస్‌ను దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్ను అని చెప్పొచ్చు. నిత్యం లక్షల మంది రైల్వే ప్రయాణం చేస్తుంటారు. ఇతర మార్గాల్లో ప్రయాణంకన్నా ట్రైన్ జర్నీ బాగుంటుందని చాలా మంది భావిస్తారు. అందుకే ముందుగానే టికెట్లను బుక్ చేసుకొంటూ ఉంటారు.

టికెట్ కన్ఫార్మ్ అయితే ప్రయాణం కూడా సాఫీగా జరిగిపోయినట్లే. సెక్యూరిటీ ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఫ్యామిలీ మొత్తం హాయిగా నిద్రపోతూ జర్నీ చేయొచ్చు. ఈ సౌకర్యం బస్సు, విమానాల్లో సామాన్యులకు అందుబాటులో ఉండదు. ట్రైన్ జర్నీ చేసే వారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇండియన్ రైల్వేస్ రూల్స్ గురించి అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే ప్రయాణంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయి.

passengers must know about these railway rules..
అయితే తాజాగా భారతీయ రైల్వే ఒక నిబంధనను తెచ్చింది. అదేంటంటే..హెడ్ ‌ఫోన్స్ లేకుండా మొబైల్ ఫోన్స్‌లో పాటలు వినడం లేదంటే సినిమాలు చూడడం వంటివి చేయకూడదు అని రూల్ చేసింది. ఫోన్ నుంచి వచ్చే సౌండ్ వల్ల ఇతరులు ఇబ్బంది పడుతూ ఉంటే.. అది నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుంది. తోటి ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేయవద్దు. అలాగే జర్నీ చేసేటప్పుడు ఫోన్‌లో గట్టిగా మాట్లాడకూడదు అని రైల్వే శాఖ వెల్లడించింది.

passengers must know about these railway rules..
అలాగే కంపార్ట్‌మెంట్లలోని ఛార్జింగ్ పాయింట్లు కూడా రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు స్విచ్ ఆఫ్ చేస్తామని రైల్వే శాఖ తెలిపింది. ఇతరులకు ఇబ్బంది కలిగేలా ఫోన్ లు వాడటం.. అలాగే రాత్రి చాలా సేపు లైట్స్ ఆన్ చేసి ఉండటం గురించి చాలా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యం లో రైల్వే శాఖ నిబంధనలు కఠిన తరం చేసింది.
మరి కొన్ని నిబంధనలు ఇప్పుడు చూద్దాం..

passengers must know about these railway rules..
ట్రైన్‌లో జర్నీ చేసేటప్పుడు మిడిల్‌ బెర్త్ వారికి కొన్ని సార్లు ఇబ్బంది కలగొచ్చు. లోయర్ బెర్త్, అప్పర్ బెర్త్ లభించిన వారు వారి సీటులో హాయిగా నిద్రపోవచ్చు. అయితే మిడిల్ బెర్త్‌‌ వచ్చిన వారు కావాలనుకున్నప్పుడు నిద్రపోవడానికి ఉండదు.
అయితే రూల్స్ ప్రకారం.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మిడిల్ బెర్త్‌ను ఓపెన్ చేసుకొని పెట్టుకోవచ్చు.

passengers must know about these railway rules..
లోయర్ బెర్త్‌లో ప్రయాణికులు రాత్రి 10 దాటిన తర్వాత కూడా కూర్చొని ఉంటే.. మీరు వారికి రూల్స్ గురించి తెలియజేయవచ్చు. మాట వినకపోతే టీసీకి ఫిర్యాదు చేయొచ్చు.

passengers must know about these railway rules..
రాత్రి 10 దాటిన తర్వాత ట్రైన్‌లో టికెట్లను చెక్ చేయకూడదు. ఎవరైనా టీసీ వచ్చి మీ నిద్రకు భంగం కలిగించి టికెట్ అడిగితే మీరు వారిపై తగిన చర్య తీసుకోవచ్చు. రైల్వే రూల్స్ ప్రకారం రాత్రి 10 గంటలు దాటితే చెక్ చేయకూడదు.