పావలా శ్యామల గారిని కలిసిన యాక్టర్ జీవన్ కుమార్.. సాయి ధరమ్ తేజ్ కూడా కాల్ చేసి..!

పావలా శ్యామల గారిని కలిసిన యాక్టర్ జీవన్ కుమార్.. సాయి ధరమ్ తేజ్ కూడా కాల్ చేసి..!

by Anudeep

Ads

ఈ కరోనా గడ్డు కాలం సినీ ఆర్టిస్ట్ లకు కూడా కష్టతరం గా మారింది. 250 సినిమాల్లోకి పైగా నటించిన పావలా శ్యామల గారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఇటీవల టీవీల్లో చూసే ఉంటాం. ఆమెను ఇండస్ట్రీ పెద్దలే ఆదుకోవాలని కోరుకున్నాం.. తాజాగా యాక్టర్ జీవన్ కుమార్ ఆమెను కలిశారు. ఆయన ఇండస్ట్రీ లో ఎవరికీ ఇబ్బంది వచ్చినా అవసరమైన మేరకు తన సాయం అందిస్తారు. ఆయన వెనక ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ గా ఉంది..

Video Advertisement

jeevan kumar

పావలా శ్యామల గురించి న్యూస్ లో రాగానే ఇండస్ట్రీ అలెర్ట్ అయింది. వెంటనే జీవన్ కుమార్ గారు శ్యామల గారి వద్దకు వెళ్లి ఆమె ఇబ్బందులను తెలుసుకున్నారు. ఆమెకు ధైర్యం చెప్పి ఆమెకు అవసరమైన సాయం చేసారు. వారి కాంటీన్ నుంచి ప్రతిరోజూ భోజనం పంపే ఏర్పాటు కూడా చేయబోతున్నట్లు వివరించారు. ఆమె కు తన ఫోన్ నెంబర్ ను ఇచ్చి.. ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా ఒక్క ఫోన్ చేయమని చెప్పి వచ్చేసారు. పలువురు సినీ పెద్దలు జీవన్ కుమార్ కు ఆమె ఇబ్బంది కనుక్కోవాలని చెప్పారు. సాయి ధరమ్ తేజ్ కూడా జీవన్ కుమార్ కాల్ చేసి పరిస్థితి ని కనుక్కున్నారట. అవసరం అయితే.. తాను కూడా వస్తానని ధైర్యం చెప్పారు. ఈ విషయాన్నీ జీవన్ కుమార్ ఓ వీడియో లో వివరించారు. ఆ వీడియో ను మీరు ఇక్కడ చూడవచ్చు.


End of Article

You may also like