“నా భర్త నన్ను ముట్టుకోవట్లేదు..! పెళ్లయిన రెండవ రోజు..!” అంటూ… మహిళ ఆవేదన..! విషయం ఏంటంటే..?

“నా భర్త నన్ను ముట్టుకోవట్లేదు..! పెళ్లయిన రెండవ రోజు..!” అంటూ… మహిళ ఆవేదన..! విషయం ఏంటంటే..?

by Harika

Ads

తన భర్త తనని ముట్టుకోవట్లేదు అంటూ ఒక మహిళ ఇటీవల మీడియాతో మాట్లాడారు. పెళ్లైన మూడవ రోజు నుండి తనని ఇంట్లోకి రానివ్వలేదు అంటూ ఒక కోడలు తన అత్తవారి ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, టీఎస్ఆర్టీసీ యూనియన్ నాయకుడు రాజిరెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి పెళ్లి గత సంవత్సరం మే 21వ తేదీన పావని అనే ఒక యువతితో జరిగింది. కానీ పెళ్లయిన తర్వాత రెండవ రోజు నుంచి వారి మధ్య గొడవలు మొదలు అయ్యాయి. అసలు నిశ్చితార్థం తర్వాతే తన భర్తతో తనకి సమస్యలు వచ్చాయి అని, కానీ నిశ్చితార్థం అవ్వడంతో ఆ తర్వాత గొడవలు అయితే పరువు పోతుంది అని తన తల్లిదండ్రులు నచ్చ చెప్పారు అని పావని అన్నారు. పెళ్లయిన తర్వాత తన భర్త తనతో సంతోషంగా లేరు అని చెప్పారు.

Video Advertisement

pavani reddy marriage incident

పావనికి సోరియాసిస్ ఉంది అని, తనకి చర్మ సంబంధిత సమస్యలు ఉన్నాయి అని తెలిశాక ముట్టుకోవట్లేదు అని కార్తీక్ రెడ్డి చెప్పారు. అయితే, ఇదే విషయం మీద పావని మాట్లాడుతూ, “ఈ విషయం పెళ్లయిన 5 వ రోజు తెలిసింది. పెళ్లైన రెండవ రోజు పక్క పక్కన ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు. అప్పుడు కూడా తనని ముట్టుకోలేదు” అని చెప్పారు. కార్తీక్ రెడ్డి తండ్రి రాజిరెడ్డి ఈ విషయం మీద మాట్లాడుతూ, “ఇంత పెద్ద విషయాన్ని పావని తల్లిదండ్రులు వారికి చెప్పకుండా దాచిపెట్టి తప్పు చేశారు” అని అన్నారు. దాంతో వారి కొడుకు బాధపడుతున్నారు అని, అందుకే ఆమెకి దూరంగా ఉంటున్నారు అని చెప్పారు. కానీ పావని ఈ విషయం మీద మాట్లాడుతూ, చర్మ సంబంధిత సమస్య కారణం కాదు అని, అసలు తన భర్త తనని ముట్టుకోరు అని చెప్పారు.

watch video :

కార్తీక్ రెడ్డి, తనకి ఒక లవ్ ఫెయిల్యూర్ ఉంది అని, ఆరు సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత విడిపోయారు అని, తర్వాత ఒక సంబంధం ఎంగేజ్మెంట్ వరకు వెళ్లాక జాతకాలు కలవక క్యాన్సిల్ అయింది అని చెప్పారు అని పావని అన్నారు. ఆరు సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత ఒక అమ్మాయి విడిపోయింది అంటే, తప్పు ఇతనిలోనే ఉంది అంటూ పావని మాట్లాడారు. ఎల్బీనగర్ పోలీసులు ఈ విషయాన్ని తెలుసుకొని పావని ఉన్న స్థలానికి చేరుకున్నారు. పావని కి న్యాయం చేస్తాము అని పోలీసులు ఆమెకి హామీ ఇచ్చారు. తన పెళ్లి కోసం తన తల్లిదండ్రులు 30 లక్షల అప్పు చేశారు అని, పెళ్లి కోసం ఇచ్చిన బంగారాన్ని తన అత్తవారు ఇంకా తిరిగి ఇవ్వడం లేదు అని చెప్పారు.

watch video :

ALSO READ : ధోని భార్య ఏ ఉద్యోగం చేస్తారో తెలుసా..? ఆమె ఎంత సంపాదిస్తారంటే..?


End of Article

You may also like