ధోని భార్య ఏ ఉద్యోగం చేస్తారో తెలుసా..? ఆమె ఎంత సంపాదిస్తారంటే..?

ధోని భార్య ఏ ఉద్యోగం చేస్తారో తెలుసా..? ఆమె ఎంత సంపాదిస్తారంటే..?

by Mohana Priya

Ads

క్రికెటర్ గా ధోనికి ఉన్న పాపులారిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ధోని ఫేమస్ అయ్యారు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. చెన్నై ప్రజలు అయితే ధోని తమ సొంతవారు అన్నట్టు ఫీల్ అవుతారు. ఐపీఎల్ ద్వారా ధోని చెన్నై ప్రజలకు దగ్గర అయ్యారు. తల ధోని అని పిలుస్తారు. తమిళ్ లో తల అంటే నాయకుడు అని అర్థం. ధోని వ్యక్తిగత జీవితం గురించి కూడా అందరికీ తెలిసిందే. బీహార్ లో ఉన్న రాంచీలో ధోని పుట్టారు. డిఏవి విద్యా మందిర్ లో ధోని చదువుకున్నారు. తర్వాత తన కోచ్ కేశవ్ బెనర్జీ సలహాతో క్రికెట్ ఆడటం మొదలుపెట్టారు. సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ లో ఖరగ్ పూర్ స్టేషన్ లో ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ గా ధోని పని చేసిన విషయం అందరికీ తెలిసిందే.

Video Advertisement

ఆ తర్వాత ఉద్యోగం వదిలేసి క్రికెట్ ఆడడానికి రావడం, ఇక్కడ రాణించడం ఇదంతా తర్వాత జరిగిన కథ. 2010 లో జులై 4వ తారీకు, ధోని, సాక్షి సింగ్ రావత్ అనే స్నేహితురాలిని పెళ్లి చేసుకున్నారు. ఎవరికి తెలియకుండా, కేవలం కుటుంబీకుల మధ్యలోనే వీరి వివాహం జరిగింది. డెహ్రాడూన్ లో వీరి పెళ్లి జరిగింది. చిన్ననాటి స్నేహితురాలైన సాక్షిని ధోని ప్రేమించారు. తర్వాత వీళ్ళిద్దరూ కొన్ని సంవత్సరాలు రిలేషన్ షిప్ లో ఉన్నాక పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుండి ధోని ప్రయాణంలో సాక్షి కూడా తోడయ్యారు. ధోని ఇంత పెద్ద స్థాయికి వచ్చే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.

అలాంటి సమయంలో సాక్షి ధోనికి ధైర్యంగా నిలిచారు. అందుకే వీళ్ళిద్దరూ పవర్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. సాక్షి కూడా తన సొంత కాళ్ళ మీద తను నిలబడ్డారు. ధోని ఎంటర్టైన్మెంట్ పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టారు. ఇందులోనే సాక్షి పని చేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఒక సినిమా విడుదల చేశారు. లెట్స్ గెట్ మారీడ్ అనే సినిమాని తమిళ్ లో రూపొందించి, తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశారు. ఇంకా కొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. సాక్షి తన సొంతంగా 41 కోట్లు సంపాదించారు. ప్రొడక్షన్ హౌస్ బాధ్యతలు అన్నీ కూడా సాక్షి చూసుకుంటున్నారు. ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా వస్తున్న సినిమాల ప్రమోషనల్ ఈవెంట్స్ లో కూడా సాక్షి చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు.

ALSO READ : టిల్లు స్క్వేర్ సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా..? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?


End of Article

You may also like