Home Filmy Adda అది పవన్ కళ్యాణ్ అంటే…కుటుంబమంతా సంక్రాంతి సంబరాల్లో ఉంటే ఆయన ఏం చేసారంటే.?

అది పవన్ కళ్యాణ్ అంటే…కుటుంబమంతా సంక్రాంతి సంబరాల్లో ఉంటే ఆయన ఏం చేసారంటే.?

by Sainath Gopi

ప్రముఖ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉన్నారు అన్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ స్థాపించి, ప్రజలకి సహాయం చేయడానికి తనవంతు కృషి చేస్తున్నారు. కుటుంబ జీవితం కంటే ఎక్కువగా ప్రజల మధ్యలోనే ఉండడానికి ఆయన ప్రాముఖ్యత ఇస్తున్నారు. తాజాగా మెగా ఫామిలీ సంక్రాంతి పండుగ వేడుక ఫొటోలో ఆయన లేకపోవడమే దీనికి సాక్ష్యం.

మెగా ఫామిలీ సంక్రాంతి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో పాటు అల్లు అరవింద్ కుటుంబం కూడా హాజరయ్యారు. అంతా ఒక్కచోట చేరి సంక్రాంతి సంబరాలలో మునిగిపోయారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కొడుకు కూతురు ఆ అకిరా, ఆధ్య కూడా హాజరయ్యారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ మిస్ అవ్వడంతో ఫాన్స్ ఫీల్ అవుతున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ ఈ పండగను అమరావతిలో రాజధాని రైతులతో కలిసి జరుపుకున్నారు. నుమ రోజు తన ఫామ్ హౌస్ లో గోవుల మధ్య కనుమ వేడుకలు జరుపుకున్నారు. పశువులకు పండ్లు తినిపిస్తూ వాటి మధ్య కాసేపు గడిపారు.రైతులకు తోడుగా ఉండే పశువులు కూడా కుటుంబంలో భాగమని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలిపారు.కుటుంబమంతా ఒక చోట చేరి ఆనందంగా గడుపుతుంది పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజల మధ్య ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారితో కలిసి పండగ చేసుకున్నారు. ఇది చూసి పవన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

You may also like