Ads
మాస్ కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీశారు. మళ్లీ మీరు కాంబోలో 10 సంవత్సరాల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెరకెక్కుతుంది.
ఈ మూవీ కొద్దిరోజుల పాటు షూటింగ్ జరుపుకుంది. సినిమాలో టైటిల్ టీజర్ కూడా విడుదల చేశారు. అయితే ఉన్నట్టుండి హరీష్ శంకర్ పవన్ సినిమా వదిలేసి రవితేజతో సినిమా కోసం షిఫ్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని వెనకాల అసలు కథ ఏంటంటే…!
Video Advertisement
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఏ సినిమాకి డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఈలోపు హరిశంకర్ ఖాళీగా ఉండడం ఎందుకు రవితేజ తో ఒక సినిమాని ఓకే చేసుకున్నారు. ఇటీవల ఆ సినిమాకు సంబంధించి ఫోటోషూట్ కూడా జరిగింది. ఇది ఎప్పటినుంచో ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్త. అయితే ఈ సినిమా డైరెక్టర్ తెలుగు ఫిలిం కాదని బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ నటించిన రైడ్ సినిమాకు అడాప్షన్ అని అంటున్నారు. రీమేక్ చేయడంలో హరీష్ శంకర్ తెలుగువారికి తగ్గట్టు మాస్ కమర్షియల్ అంశాలను జోడించి సినిమాలను తీస్తూ ఉంటారు.
ఇదివరకు హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్ లో వచ్చిన మిరపకాయ్ మంచి విజయం సాధించింది. షాక్ సినిమాతో హరీష్ శంకర్ కి డైరెక్టర్ గా లైఫ్ ఇచ్చింది కూడా రవితేజ నే. ఈ మూవీ గనక పట్టాలెక్కిస్తే ఇది వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడో మూవీ అవుతుంది.
End of Article