Home Filmy Adda OG గ్లింప్స్ లో “పవన్ కళ్యాణ్” మాట్లాడిన ఆ భాష ఏంటో తెలుసా..? ఆ డైలాగ్ అర్థం ఏంటంటే..?

OG గ్లింప్స్ లో “పవన్ కళ్యాణ్” మాట్లాడిన ఆ భాష ఏంటో తెలుసా..? ఆ డైలాగ్ అర్థం ఏంటంటే..?

by Mohana Priya

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న మరొక పవర్ ఫుల్ చిత్రం ‘ఓజీ’. ఈ చిత్రం నుంచి పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ ఓ రేంజ్ లో ఉంది.

నిజంగా ఈ టీజర్ పవన్ అభిమానులకు పండగే .. చూసిన వాళ్ళు ఎవరైనా ఫుల్లీ పవర్ ప్యాక్ టీజర్ ఏముంది భయ్యా ..అనకుండా మానరు.

meaning of pawan kalyan dialogue in hungry cheetah og glimpse

ఫైర్ స్ట్రాం అనే వర్డ్ ను కంప్లీట్ గా జస్టిఫై చేస్తూ పవన్ అభిమానులు పవన్ ని ఎలా చూడాలి అని తప్పిస్తున్నారో అలాంటి మంచి యాంగిల్ లో ఈ మూవీలో పవన్ చూపించారు.’దే కాల్ హిమ్ ఓజీ’ అనే టాగ్ లైన్ తో ‘ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్’ అదే ‘ఓజీ’ టైటిల్ పవన్ ఇమేజ్ ని సరికొత్త పందాలో ఎలివేట్ చేస్తోంది. మాఫియా నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామా గ్లిమ్స్ లో పవన్ అరాచకం సృష్టించాడు.

meaning of pawan kalyan dialogue in hungry cheetah og glimpse

ఈ టీజర్ చూస్తే అప్పుడెప్పుడో తమ్ముడు మూవీ టైం లో చూసిన పవన్ తిరిగి కనిపించాడా అని అనుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో టీజర్ లో పవన్ చెప్పిన ఒక డైలాగ్ ప్రస్తుతం బాగా వైరల్ అయింది. అసలా డైలాగ్ చెప్తూ పవన్ చేసే యాక్షన్ గూస్ బంప్స్ క్రియేట్ చేస్తోంది. పైగా ఆ డైలాగ్ చెప్పింది తెలుగులో కూడా కాదు అచ్చమైన మరాఠీ యాస లో పవన్ మాట్లాడిన తీరు అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

meaning of pawan kalyan dialogue in hungry cheetah og glimpse

ఇంతకీ ఆ డైలాగు ఏమిటంటే.., “ఖడే ఖడే కాయీ బగ్థోస్, జాకర్ ధుండ్….” అంటే, “నించుని ఎం చూస్తున్నావ్ రా, వెళ్లి వెతుకు” అని అర్థం. డైలాగ్ విషయం పక్కన పెడితే అసలు పవన్ మాట్లాడేటప్పుడు ఆ ఫేషియల్ ఫీలింగ్స్. అతని యాక్షన్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. అన్నిటికంటే మూవీకి తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునే విధంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు అర్జున్ దాస్ వాయిస్ తో కూడిన ఎలివేషన్స్ వింటుంటే మూవీపై అంచనాలు రేంజ్ లో పెరుగుతూ పోతున్నాయి.

ALSO READ : “ఖుషి” మూవీలో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్న ఆ నటి ఎవరో తెలుసా..?

You may also like