విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో నిన్న విడుదలైన రొమాంటిక్ మూవీ ఖుషి. ఈ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనింగ్ మూవీ మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

Video Advertisement

శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీ డైరెక్టర్ కే కాక హీరో మరియు హీరోయిన్ కి కూడా మంచి కంబ్యాక్ మూవీ అవుతుంది అని అందరూ ఆశిస్తున్నారు.

గీత గోవిందం మూవీ తర్వాత తిరిగి విజయ్ దేవరకొండ ఆరెంజ్ సక్సెస్ ఖుషి తో అందుకుంటాడు అని అందరూ అనుకుంటున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తో ముందుకు వెళ్తున్న ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.హేషమ్ అబ్దుల్ మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రాణం పోసింది. స్టోరీ అందరికీ తెలిసినప్పటికీ తీసిన విధానం ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో మూవీపై మంచి టాకీ వచ్చింది.

kushi movie review

మరోపక్క మూవీకి హిట్ టాక్ రావడంతో.. ఇలాంటి మాట విని ఐదు సంవత్సరాలు దాటింది అంటూ విజయ్ దేవరకొండ ఆనందంగా ట్విట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్లో బాగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఖుషి మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే మొదట ఏ మూవీకి హీరోయిన్ గా సమంత ప్లేస్ లో రష్మిక ని అనుకున్నారట.

kushi movie review

కానీ ఆల్రెడీ చాలాసార్లు ఆన్ స్క్రీన్ రష్మిక, విజయ్ దేవరకొండ కాంబినేషన్ జనాలు చూశారు. కాబట్టి తిరిగి వాళ్ళిద్దరినీ ఈ స్టోరీకి తీసుకుంటే కథ చాలా రొటీన్ అనిపిస్తుంది అని భావించిన డైరెక్టర్ ఈ సినిమాకు సమంతను అప్రోచ్ అయ్యారట. సమంత ,విజయ్ దేవరకొండ ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఖుషి మూవీలో సెగలు పుట్టిస్తుంది.. మరి డైరెక్టర్ ఛాయిస్ అంత అద్భుతంగా ఉంది మరి.

ALSO READ : “థాంక్యూ సుజిత్ అన్నా..!” అంటూ… “పవన్ కళ్యాణ్” OG గ్లింప్స్ పై 15 మీమ్స్..!