Ads
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, ఇప్పుడు పవర్ స్టార్ గా ఎదిగారు పవన్ కళ్యాణ్. ఒకపక్క సినిమాలు చేస్తూనే, మరొక పక్క రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. షూటింగ్స్ కి కొంత కాలం బ్రేక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నారు. మూడు సినిమాలు కూడా వరుసగా షూట్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం వీటన్నిటికి కూడా బ్రేక్ పడింది. పవన్ కళ్యాణ్ లేని సీన్స్ షూట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటున్నారు.
Video Advertisement
అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా లెక్కచేయకుండా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ ని చూడడానికి, ఆయన మాటలు వినడానికి ఎన్నో లక్షల మంది ప్రజలు తరలివస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నామినేషన్ పత్రంలో పవన్ కళ్యాణ్ తన చదువుకి సంబంధించిన వివరాలను కూడా తెలిపారు. పవన్ కళ్యాణ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా తన చదువు ఉన్నట్టు చెప్తూ ఉంటారు.
ఒకసారి తనకి వచ్చిన మార్కులకు సీట్ రాకపోవడంతో, నెల్లూరులో ఉన్న ఒక ఇంటర్మీడియట్ కళాశాలలో రికమండేషన్ ద్వారా సీఈసీ లో సీట్ తీసుకున్నట్టు ఒక సభలో తెలిపారు. ఇంకొక సభలో ఏమో తను అనుకున్న గ్రూపులో సీట్ రాకపోవడంతో, మరొక ఆప్షన్ లేక ఎంఈసీలో సీట్ తీసుకున్నట్టు తెలిపారు. ఇంకొక చోట మాత్రం స్నేహితులతో కలిసి ఎంపీసీలో ట్యూషన్ కి వెళ్ళినట్టు చెప్పారు.
తనకు చదువు అంటే చాలా ఇష్టం అని, కానీ చదువుకోలేకపోయినట్టు చెప్పారు. ఒకసారి ఎలక్ట్రానిక్ డిప్లమా, ఇంకొకసారి కంప్యూటర్స్ లో డిప్లమా అని చెప్పారు. ఒకసారి ఇంగ్లీష్ తనకి బాగా రాదు అని అన్నారు. ఇంకొకసారి ఇంగ్లీష్ లో తాను ఫస్ట్ అన్నట్టు చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ 1984 లో నెల్లూరులో ఉన్న సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో పదవ తరగతి చదివారు. కానీ పవన్ కళ్యాణ్ కి పుస్తక పఠనం మాత్రం అలవాటు ఉంది. ఎన్నో రకమైన పుస్తకాలని పవన్ కళ్యాణ్ చదువుతారు.
ALSO READ : “సాయి పల్లవి”, “భానుప్రియ” తో పాటు… తమ “డాన్స్” తో గుర్తింపు సంపాదించుకున్న 14 మంది హీరోయిన్స్..!
End of Article