Ads
వరుస సినిమాలు చేస్తూ, ఇప్పుడు బ్రేక్ ఇచ్చి, ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు 3 సినిమాల్లో నటిస్తున్నారు.
Video Advertisement
అందులో మొదటిది, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా. ఎప్పుడో స్టార్ట్ అయిన ఈ సినిమా, భారీ ఫైట్స్ తో రూపొందుతోంది. నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కూడా పొందారు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. ఇవి మాత్రమే కాకుండా, సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతుంది. పవన్ కళ్యాణ్ గురించి అభిమానులకి చాలా విషయాలు తెలుసు. పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా. ఇవి చాలానే ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ కి సీ ఫుడ్ అంటే కూడా చాలా ఇష్టం.
అందులోనూ ముఖ్యంగా, నెల్లూరు చేపల పులుసు అంటే పవన్ కళ్యాణ్ కి ఇష్టం. అంతే కాకుండా నాటుకోడి చికెన్, పులిహోర కూడా పవన్ కళ్యాణ్ ఇష్టంగా తింటారు. ఒక సమయంలో పవన్ కళ్యాణ్ గురించి, త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ చాలా విషయాల గురించి చర్చించుకుంటూ ఉంటారు అని, ఎవరికీ పుస్తకాలు ఇవ్వని త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కి మాత్రమే తన పుస్తకాలు ఇస్తారు అని చెప్పారు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన ఆహారాల గురించి కూడా చెప్పారు.
పవన్ కళ్యాణ్ కి వెజిటేరియన్ ఆహారాలు కూడా చాలా ఇష్టం అని చెప్పారు. ఉప్మాతో పాటు, రవ్వ లడ్డు లాంటి స్వీట్స్ కూడా పవన్ కళ్యాణ్ కి ఇష్టం అని, వారి ఇంట్లో పవన్ కళ్యాణ్ కి ఏది కావాలి అంటే అది తినే స్వేచ్ఛ ఉంటుంది అని ,మొహమాట పడరు అని చెప్పారు. పవన్ కళ్యాణ్ కి హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం అనే విషయాన్ని రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. కానీ సినిమాలు చేస్తున్నప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ ఆహార విషయంలో జాగ్రత్తగా ఉంటారు.
బ్రో సినిమా చేస్తున్న సమయంలో కేవలం శాఖాహారం మాత్రమే తీసుకున్నారు. కేవలం పాలు, కూరగాయలు మాత్రమే పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు సముద్రఖని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంతే కాకుండా అంతకుముందు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేటప్పుడు వకీల్ సాబ్ సినిమా సమయంలో కూడా ఒక ప్రత్యేకమైన డైట్ తీసుకున్నారు. అలా సినిమాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటారు. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఆ పాత్రకి ఎలాంటి ఆహారం అవసరమో అలా మాత్రమే తింటారు. పాత్ర ప్రాముఖ్యతను బట్టి కూడా పవన్ కళ్యాణ్ ఆహారాన్ని తీసుకుంటారు.
ALSO READ : గవర్నమెంట్ జాబ్స్ ఉన్న 5 మంది భారత క్రికెటర్స్…ఎవరెవరు ఏ హోదాలో అంటే.?
End of Article