Ads
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సింగిల్ గా పోటీ చేయకుండా బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. మంగళవారం హైదరాబాదులో జరిగిన బీసీ గర్జన సభలో ప్రధాని మోడీతో కలిసి హాజరయ్యారు.
Video Advertisement
ఈ సభలో మోడీకి పవన్ కళ్యాణ్ కి మధ్య ఉన్న సత్సంబంధం చూసి జనసేన నాయకులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు. మోడీ తన పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నారంటూ ప్రసంగంలో చెప్పగా అది హైలైట్ గా నిలిచింది.
పొత్తులో భాగంగా బిజెపి జనసేనకు ఎనిమిది సీట్లు కేటాయించింది. తాజాగా ఆ 8 సీట్లలో నిలబడే అభ్యర్థుల పేర్లను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉన్న కూకట్ పల్లి నియోజకవర్గంలో మమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కి సీటు ఇచ్చారు.తాండూరు నియోజకవర్గంలో వేమూరి శంకర్ గౌడ్ ని జనసేన అభ్యర్థిగా ప్రకటించారు. కోదాడ మేకల సతీష్ రెడ్డి, నాగర్ కర్నూల్ వంగ లక్ష్మణ్ గౌడ్, ఖమ్మం మిరియాల రామకృష్ణ, కొత్తగూడెం లక్కినేని సురేందర్ రావు, వైరా సంపత్ నాయక్, అశ్వరావుపేట మూయబోయిన ఉమాదేవి పేర్లను జనసేన అధినేత ప్రకటించారు.
అయితే జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ప్రకార్డులు ప్రదర్శించారు. పవన్ ప్రజా సమస్యలపై ఏనాడు పోరాడలేదని, పవన్ తెలంగాణలో రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. పవన్ కళ్యాణ్ ని తరిమి కొడతామంటు హెచ్చరించారు. పవన్ ఓ ఐటెం సాంగ్ లు చేసుకునే వ్యక్తి అంటూ విమర్శించారు. ఈ పరిణామాలు చూస్తుంటే తెలంగాణలో రాజకీయాలు వేడెక్కినట్లు కనిపిస్తుంది.ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరపున పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేసే అవకాశం కనిపిస్తుంది.
Also Read: ఇలా పార్టీలో చేరారు… అలా కూకట్ పల్లి టికెట్ ఇచ్చిన జనసేన…. వెనకున్న కారణం ఇదేనా…?
End of Article