Ads
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు మధ్య మంచి సత్సంబంధాలు ఉంటాయి. సినిమాల విషయంలో హీరో ఫ్యాన్స్ బయట గొడవలు పడుతూ ఉంటారు గాని నిజానికి హీరోలు అందరూ కలిసిమెలిసిగానే ఉంటారు. మహేష్ బాబు ఒక వేదికలో మేం మేం బాగానే ఉంటాం, మీరు కూడా బాగుండాలని బహిరంగంగానే చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా అందరు అభిమానులు బాగుండాలి… గొడవలు పడవద్దు మేమందరం కలిసి ఉంటాం అంటూ చాలాసార్లు చెప్పారు.
Video Advertisement
ఇదంతా నిరూపించేలా హీరోలందరూ కలిసి ఏర్పాటు చేసుకునే ఫంక్షన్ లలో వారందరూ కలిసిమెలిసి దిగిన ఫోటోలు చూస్తే ఫాన్స్ కూడా ముచ్చట పడుతుంటారు.ఇదే సంబంధం సినిమాలు విషయంలో కూడా కనిపిస్తూ ఉంటుంది.ఒక హీరో సినిమాలో ఒక హీరో గెస్ట్ రోల్ చేయడం.
ఒకరి ఆడియో ఫంక్షన్ కి ఒకరు రావడం. ఒకరి సినిమాని ఒకరు ప్రమోట్ చేయడం.ఒకరి సినిమాలో ఇంకొకరు గొంతు కలిపి పాట పాడడం ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కోసం తన గొంతు కదపనున్నారు. గొంతు కదపటం అంటే పవన్ కళ్యాణ్ ఏమి పాట పాడడం లేదు. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో హీరో ఇంట్రడక్షన్ కోసం పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు ఫిలింనగర్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాలో హీరో క్యారెక్టర్ గురించి చెప్తు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అది జల్సా సినిమాకి చాలా ప్లస్ అయింది. ఇప్పుడు మహేష్ కోసం పవన్ కళ్యాణ్ ముందుకు రానున్నారు.
ఇక్కడ విశేషమేంటంటే అప్పుడు జల్సా సినిమాకి ఇప్పుడు గుంటూరు కారం సినిమాకి దర్శకుడు త్రివిక్రమ్ కావడం. త్రివిక్రమ్ కి పవన్ కళ్యాణ్ కి ఉన్న అనుబంధం గురించి వేరేగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే మహేష్ తో త్రివిక్రమ్ కి కూడా మంచి అనుబంధం ఉంది. సో దీన్ని బట్టి చూస్తే ఫ్రెండ్షిప్ కోసం పవన్ కళ్యాణ్ గొంతు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు అనమాట. ఒకవేళ ఇదే నిజమైతే మహేష్ బాబు ఫ్యాన్స్ కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పునకాలే….!
End of Article