పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ శనివారం “జొమాటో” పుట్టిన రోజు సందర్భం గా ట్విట్టర్ మాధ్యమం లో ఓ పోస్ట్ ద్వారా విష్ చేశారు. పేటీఎం ఫన్నీ గా పెట్టిన బర్త్ డే విషెస్ పోస్ట్ ను షేర్ చేస్తూ తనదైన శైలిలో..” మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, ప్రియమైన జోమాటో! మీ స్టాక్ మార్కెట్ అరంగేట్రం ప్రతి పేటీఎం యూజర్ తరపున సూపర్ డూపర్ గా ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ పోస్ట్ చేశారు.

ఇంతకీ, పేటిఎమ్ ఏమని పోస్ట్ చేసిందో తెలుసా..? “ప్రియమైన జోమాటో, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మేము పుట్టినరోజు సందర్భంగా సర్ ప్రైజ్ ఇవ్వడం కోసం కేక్ ను ఆర్డర్ చేసాము. కానీ ఆ ఆర్డర్ జొమాటో నుంచే వస్తుంది కాబట్టి అందులో సర్ ప్రైజ్ ఏమి ఉండదని భావించాము. అందుకే.. మీకోసం స్పెషల్ ఎమోజి కేక్ ను ఇక్కడ పంపిస్తున్నాము..” అంటూ ఒక కేక్ ఎమోజి ని పెట్టి పేటిఎమ్ పోస్ట్ చేసింది.

ఈ సరదా పోస్ట్ కి జొమాటో నుంచి ఫన్నీ రిప్లై వచ్చింది. “ధన్యవాదాలు! మా ఫైనాన్స్ బృందం మీ ఎమోజి కేక్ కోసం ట్రీట్ చేయలేమని చేస్బుతోంది. కాబట్టి ఈ కాష్ సరిపోతాయని అనుకుంటున్నాము” అంటూ కాష్ ఎమోజి ని పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ ల కింద నెటిజన్లు కూడా సరదా కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు.
Dear @zomato,
We wish you a Happy Birthday. ?
We would have paid for a surprise cake but the order would be from zomato and the surprise would be ruined.
So here’s a surprise emoji cake instead. ?
— Paytm ? ? (@Paytm) July 10, 2021
