పేటీఎం ఫాస్టాగ్స్, అకౌంట్లు, వాలెట్స్ వంటి వాటికి ఆర్‌బీఐ ఏం సమాధానం ఇచ్చిందంటే..?

పేటీఎం ఫాస్టాగ్స్, అకౌంట్లు, వాలెట్స్ వంటి వాటికి ఆర్‌బీఐ ఏం సమాధానం ఇచ్చిందంటే..?

by kavitha

Ads

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 31న పేటీఎం పేమెంట్స్ బ్యాంకు పై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. డిపాజిట్స్ స్వీకరణ, అకౌంట్లు, వాలెట్స్, ఫాస్టాగ్స్ మరియు టాప్ అప్ లను నిలిపేసేందుకు ఫిబ్రవరి 29 వరకు గడువు ఇచ్చింది. అయితే కస్టమర్లలో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Video Advertisement

వాలెట్లు,  పేటీఎం బ్యాంక్, ఫాస్టాగస్, క్యూఆర్ కోడ్‌‌ల విషయాలలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  దీంతో తాజాగా రిజర్వ్ బ్యాంక్  వాటికి జవాబులు ఇవ్వడమే కాకుండా, బ్యాంకుకు విధించిన గడువును కూడా పెంచింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

mistake by paytm payments bank

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎం పేమెంట్ బ్యాంక్ వినియోగదారులకు ఇచ్చిన గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  ఫిబ్రవరి 29 చివరి తేదీ ఉండగా, దానిని మార్చి 15 దాకా పొడిగించింది.  ఆలోపు పేటీఎం బ్యాంక్ వినియోగదారులు, మర్చంట్లు తమ అకౌంట్స్ ని ఇతర బ్యాంకులకు చేంజ్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ క్రమంలో కస్టమర్లు నుండి ఎక్కువగా ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ మేరకు 30 ప్రశ్నలు మరియు జవాబులను డాక్యుమెంట్ రూపంలో ఆర్‌బీఐ రిలీజ్ చేసింది.

నగదు విత్‌డ్రా:
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బును మార్చి 15 అనంతరం ఖాళీ అయ్యే వరకు వాడుకునే అవకాశం ఉంటుంది. నగదును పేటీఎం డెబిట్ కార్డుతో విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ అకౌంట్లో మార్చి 15 అనంతరం నగదును డిపాజిట్ చేయడానికి వీలులేదు.  వడ్డీ, క్యాష్‌బ్యాక్స్ వంటివి పార్ట్‌నర్ బ్యాంకుల నుండి రిఫండ్స్, స్వీప్ ఇన్ కు అనుమతిస్తారు.

ఈఎంఐ /ఆటో డెబిట్: 
పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో డబ్బు ఉన్నంత వరకు ఆటో డెబిట్ వెసులుబాటు ఉంటుంది. మార్చి 15 అనంతరం డబ్బు లేకుంటే ఈ ఆప్షన్ పనిచేయదు. అనగా మళ్లీ డిపాజిట్ చేయలేరు. ఈఎంఐ కానీ, ఓటీటీ సబ్స్క్రిప్షన్ చెల్లిస్తున్న వారు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలని ఆర్‌బీఐ సూచించింది.

వేతనాలు, పెన్షన్లు: 
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లో శాలరీ ఖాతా ఉన్నవారు మార్చి 15 అనంతరం ఆ నగదు పొందలేరు. పింఛన్లు సైతం ఈ అకౌంట్ లో జమ కావు. అందువల్ల మార్చి 15లోపు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని ఆర్‌బీఐ సూచించింది.

సబ్సిడీ: 
గవర్నమెంట్ నుండి ఆధార్‌ కార్డ్ తో లింక్ అయ్యి, ఉన్న మనీ ట్రాన్స్ఫర్ లేదా సబ్సిడీ వంటివి వస్తుంటే, వారు మార్చి 15 లోపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: వైయస్ షర్మిలకి కాబోయే కోడలి తల్లిదండ్రులు ఎవరో తెలుసా..? ఆ అమ్మాయి తండ్రి ఏ ఉద్యోగం చేస్తారంటే..?

 


End of Article

You may also like