Ads
హైదరాబాద్ లో చిన్న వానకే మ్యాన్ హోల్స్ నోర్లు తెరిచి ఉంటాయి. రోడ్లపై పొంగుతున్న డ్రైనేజి వాటర్లో ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి . జిఎచ్ఎమ్ సి అధికారులు ఎప్పటికప్పుడు సమస్యలని పరిష్కరిస్తున్నప్పటికి వర్షం పడిన ప్రతిసారి ఏదో ఒక ఘటన చోటుచేసుకుంటూనే ఉంటుంది. తాజాగా పీర్జాదిగూడాలో జరిగిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు డ్రైనేజి మ్యాన్ హోల్ లో పడిపోయారు. అందులో ఒకరు నెలల పసికందు .
Video Advertisement
కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు నీట మునిగిపోయేవి . స్థానికులు అలెర్ట్ అయి రక్షించడంతో చంటిపిల్ల, ఒక మహిళ ప్రాణాలతో బయటపడ్డారు . హైదరాబాద్లోని పీర్జాది గూడలో రోడ్ల మరమ్మత్తుల కోసం తవ్విన గుంతలని పూడ్చలేదు.దీంతో నగరంలో నిన్న కురిసిన వర్షానికి గుంతలు నీటితో నిండిపోయాయి. అక్కడికి సమీపంలో ఉన్న హాస్పిటల్ కి చెకప్ కోసం వచ్చింది ఒక కుటుంబం . మధ్య వయస్కురాలు చంటి బిడ్డని ఎత్తుకుని హాస్పిటల్ వైపు నడుస్తుండగా చూస్కోకుండా అడుగుపెట్టి గుంతలో పడిపోయింది.
చేతిలో ఉన్న చంటిబిడ్డని మునిగిపోకుండా ప్రయత్నించింది, ఇంతలో చుట్టుపక్కల ఉన్నవాళ్లు వారిద్దరిని రక్షించారు. మహిళ చిన్న చిన్న గాయాలతో బయటపడినప్పటికి పాప ఆరోగ్యం ఎలా ఉందన్నది తెలియాల్సి ఉంది. గతంలో కూడా ఈ ప్రాంతంలో కారు గుంతలో పడిందని సమాచారం. ఇంత జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్న ఎదురవుతున్నది. వర్షాలు పడినప్పటికి బయటికి వచ్చేవాళ్లు అప్రమత్తంగా ఉండాలి .
watch video:
View this post on Instagram
End of Article