పెళ్ళైన కొన్నిరోజులకే భర్తను కాదని…ప్రియుడితో కలిసి ఉరి..! త‌ప్పెవ‌రిది? శిక్షెవ‌రికి??

పెళ్ళైన కొన్నిరోజులకే భర్తను కాదని…ప్రియుడితో కలిసి ఉరి..! త‌ప్పెవ‌రిది? శిక్షెవ‌రికి??

by Anudeep

Ads

నేటి కాలం యువత ప్రేమలు విఫలం అవుతుండటంతో…నిండు నూర్లేళ్ళు జీవించాల్సిన ప్రాణాలు మధ్యలోనే వదిలేస్తున్నారు..పెద్దలు వివాహానికి ఒప్పుకోకపోవడంతో..బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.ప్రేమకు కులం,మతం,తెలియదు కదా అందుకే ప్రేమికులు ఒకరిని ఒకరు విడిచి ఉండలేకపోతున్నారు.ఇలాంటి ఘటనే తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నవాబుపేట లో జరిగింది.

Video Advertisement

రంగా రెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లికి చెందిన కార్తీక్ (21 ) సారా మీనా (21 ) ఇంటర్ వరకు కలిసే చదువుకున్నారు.ఇద్దరి స్నేహం కొన్నాళ్ళకి ప్రేమగా మారింది.ఈ విషయాన్నీ ఇంట్లో పెద్దలకి చెప్పగా పెద్దలు నిరాకరించారు.మహేశ్వరం మండలం గుటపల్లికి చెందిన యువకుడితో మీనా కి పెళ్లి చేసారు.అయినా కూడా వీరి ప్రేమ వ్యవహారం కొనసాగించారు.మంగళవారం రోజు కార్తీక్ తన ఫ్రెండ్ పెళ్ళికి వెళుతున్నా అని చెప్పి వెళ్ళాడు.మీనా కూడా ఇంట్లో ఎవరి లేని సమయం చూసి ఇద్దరు వెళ్లిపోయారు.చీకటి పడుతున్నా ఇంతకీ మీనా ఇంటికి రాకపోవటంతో తల్లిదండ్రులకి విషయం చేసారవేసారు.ఎంత వెతికినా ఇద్దరి ఆచూకీ దొరకలేదు.

బుధవారం నాడు పులపల్లి శివారుల్లో ఇద్దరు చెట్టుకి ఉరి వేసుకున్నట్టు గుర్తించారు.అనంతరం స్థానిక రైతులు విషయాన్ని గ్రామా సర్పంచ్ కి చేరవేశారు.వీరి ఇద్దరి దగ్గర దొరికిన మొబైల్స్ ఆధారంగా వీరి పేర్లు కార్తీక్,మీనాలుగా పోలీసులు గుర్తించారు.కడదాకా కలిసి నడవాల్సిన వారు చిన్న వయసులోనే ప్రాణాలు తీసుకోవటం తల్లిదండ్రులను తీవ్రంగా భాదిస్తుంది.ఇలాంటి విషయాలలో తలిదండ్రులు కూడా అర్థం అయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చెయ్యాలి.

representative image

త‌ప్పెవ‌రిది? శిక్షెవ‌రికి??

ఇంట‌ర్ లోనే ప్రేమ‌…ఆ వ‌య‌స్సులో ఉండేది ప్రేమ‌కాద‌ని తెలుసుకోలేక పోయింది! ఆత్మ‌హ‌త్య లాంటి త‌ప్పుడు నిర్ణ‌యం తీసుకుంది. 21 సంవ‌త్స‌రాల అబ్బాయి, పెళ్లి త‌ర్వాత కూడా త‌న‌పై ఇంకా ఆశ‌లు పెట్టుకున్నాడు. క‌లిసి బ‌త‌క‌లేక‌పోతే క‌లిసి చావ‌డం బెట‌ర్ అనే త‌ప్పుడు ఆలోచ‌న‌ను ఆమెలో క‌లిగేలా చేశాడు. ఇలా ఇతరుల చేసిన తప్పుకి బలైపోయింది మాత్రం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వరుడే. కనీసం తల్లితండ్రులలైనా ముందే ఆలోచింది నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది. జీవితంలో ఎంతో ముఖ్య‌మైన ఘ‌ట్టం ఇలా నెల‌లోపే ముగుస్తుంద‌ని ఊహించి ఉండ‌డు. అతని క‌ల‌ల‌న్నీ క‌ల్ల‌లుగా మిగిలాయి.! అత‌డికి ఇంకో భార్య దొరుకుతుంది…కానీ ఈ గాయం మానుతుందా?


End of Article

You may also like