Ads
చైన్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలుపెట్టి తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోగా నటించారు హరీష్ కుమార్. 1979 లో వచ్చిన ముద్దుల కొడుకు సినిమాలో అక్కినేని నాగేశ్వరావు గారు, శ్రీదేవి గారి కొడుకుగా నటించారు హరీష్. హరీష్ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మళయాళం సినిమాల్లో నటించారు. సీతామాలక్ష్మి, ప్రేమకానుక, ప్రేమాభిషేకం, కొండవీటి సింహం, త్రిశూలం, నా దేశం, శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలతో పాటు, కన్నడ, మలయాళం, తమిళ్ సినిమాల్లో కూడా నటించారు హరీష్.
Video Advertisement
వివాహ భోజనంబు, ప్రేమఖైదీ, మాధవయ్యగారి మనవడు, ప్రేమ పంజరం, పెళ్ళాం చెపితే వినాలి, రౌడీ ఇన్స్పెక్టర్, యుగళగీతం, ప్రేమవిజేత, ఏమండీ ఆవిడ వచ్చింది, బంగారు కుటుంబం, ఎస్పీ పరశురాం, కొండపల్లి రత్తయ్య, గోకులంలో సీత, డాడీ డాడీ, హిందీలో ఆ గయా హీరో, ఆంటీ నంబర్ 1, చోటా చేతన్, ఆర్మీ, భీష్మ, కూలి నెంబర్ 1, ప్రేమ్ ఖైదీ తో పాటు, ఇంకా ఎన్నో సినిమాల్లో నటించారు.
ప్రేమ్ ఖైదీతో హిందీలో కూడా మంచి గుర్తింపు పొందారు హరీష్. హరీష్ తెలుగులో చివరిగా 2007 లో వచ్చిన పెళ్లయింది కానీ సినిమాలో, హిందీలో 2018 లో వచ్చిన ఆ గయా హీరో సినిమాలో కనిపించారు. 1995 లో హరీష్ కి, సంగీతతో వివాహం అయ్యింది. వారికి ఇద్దరు కొడుకులు.
ప్రస్తుతం హరీష్, తన భార్య పిల్లలతో కలిసి ముంబైలో ఉంటున్నారు. ప్రేమ్ ఖైదీ సినిమా హిట్ అవడంతో హిందీలో ఎన్నో సినిమాలు చేశారు హరీష్. దాంతో తర్వాత తెలుగు ఇండస్ట్రీలో కొంచెం తక్కువగా కనిపించారు. హరీష్ మళ్లీ ఒక మంచి పాత్రతో తెలుగులో కం బ్యాక్ ఇవ్వాలని ఆశిద్దాం.
End of Article