Ads
లాక్ డౌన్ అని ప్రభుత్వం ప్రకటించగానే దేశం మొత్తం స్తంబించిపోయింది..రవాణా సదుపాయం లేకపోవడంతో ఎక్కడి వాళ్లక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి..ప్రజల ప్రాణాలు రక్షించడానికి , కరోనా వ్యాప్తి చెందకుండా కట్టడి చేయడానికి ప్రభుత్వానికి లాక్ డౌన్ ని మించిన పరిష్కారం కనపడలేదు .కానీ లాక్ డౌన్ మూలంగా ఒక మహిళ ఇద్దరు పిల్లలతో బిక్షాటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఆమె బిక్షాటనకి , లాక్ డౌన్ కి సంబంధం ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.
Video Advertisement
నిజానికి లాక్ డౌన్ ప్రకటించగానే ఇంట్లో కూర్చోవడమే కదా అనుకున్నారు, అది కూడా కొందరు ఇబ్బంది పడ్డారు.దాంతో పని లేకపోయినా ఏదో ఒక వంకతో బయటికి వచ్చే వారే ఎక్కువయ్యారు . వారి మూలంగా నిజంగా అత్యవసరం వలనో, ఆపద వచ్చో రోడ్లపైకి వచ్చేవారెవరనేది అర్దం కావడంలేదు.. మీడియా కూడా కరోనా అప్డేట్స్లో మునిగిపోవడం వలన ఇలా ఇబ్బందులు పడుతున్న వారి గురించి వార్తలు రాయడమే తగ్గిపోయింది . నిజానికి మనం కదిపితే మన చుట్టే కన్నీరు తెప్పించే గాధలెన్నో.
పెద్ద పల్లి జిల్లా రామగుండం ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం సుబ్లేడ్ గ్రామంలో ఓ శుభకార్యానికి హాజరైంది.మార్చి 23న తిరుగు ప్రయాణంలో భాగంగా ఆటోలో మహబూబాబాద్ కు వచ్చింది. ఇక్కడి నుంచి రైలులో పెద్దపల్లికి వెళ్దాలనుకుంది.కాని సరిగ్గా అదే రోజు లాక్ డౌన్ స్టార్ట్ కావడంతో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది . దాంతో అక్కడే చిక్కుకుపోయింది.
ఆ ఊరిలో తెలిసిన వాళ్లెవరూ లేరు, కనీసం ఇంటి వాళ్లు వీళ్ల సమాచారం తెలుసుకోవడానికైనా ఆమె దగ్గర ఫోన్ లేదు ,బయట మనుషులే కరువయ్యారు.. కనపడిన వారిని సాయం చేయమందామంటే కరోనా భయంతో అందరూ ఆమడదూరం పోయే , చేసేదేం లేక రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోనే భిక్షాటన చేస్తూ , దాతలెవరైనా ఫూడ్ సప్లై చేస్తే అక్కడకి వెళ్లి ఫూడ్ తెచ్చి తనింత తింటూ, పిల్లలిద్దరికి పెడుతూ 17 రోజులుగా జీవనం సాగించారు. ఈ విషయం అక్కడి పోలీసులకి తెలియడంతో ఆమె దగ్గర వివరాలు తీసుకుని, ఒక ఆటో మాట్లాడి మహిళని తిరిగి వారి చుట్టాలింటికి ఖమ్మం పంపించారు.
End of Article